Makkal Needhi Maiam : ఓటమి నుంచి తేరుకోకముందే కమల్ హాసన్‌కు మరో షాక్.. ఎంఎన్ఎంను వీడిన‌ కుమార్ వేల్

గత నెలలో జరిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీధి మయ్యమ్ (MNM)పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

Makkal Needhi Maiam :  ఓటమి నుంచి తేరుకోకముందే కమల్ హాసన్‌కు మరో షాక్.. ఎంఎన్ఎంను వీడిన‌ కుమార్ వేల్

Makkal Needhi Maiam

Makkal Needhi Maiam గత నెలలో జరిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీధి మయ్యమ్ (MNM)పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కమల్ హాసన్ కూడా బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోక ముందే కమల్ హాసన్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాల తర్వాత నుంచి ఒక్కొక్కరుగా నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.

తాజాగా, ఎంఎన్ఎంకి కీలక నేత సీకే కుమారవేల్ సహా మరో ఆరుగురు పార్టీకి రాజీనామా చేశారు. హీరో ఆరాధ‌న‌, వ్య‌క్తి పూజను వ్య‌తిరేకిస్తూ పార్టీకి గుడ్ బై చెబుతున్నాన‌ని కుమార్‌వేల్ రాజీనామా అనంతరం వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పార్టీ స్ట్రాటజీ టీం తప్పుడు విధానాలను అవలంభించింది. ‘వ్యక్తిపూజకు ఆస్కారం లేదు.. లౌకికవాద ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రయాణించాలనుకుంటున్నా.. మేము చరిత్రను సృష్టించాల్సింది కానీ, మేము చరిత్రనను చదువుతున్నాం అని కమల్‌ కు కుమార్‌వేల్ చురకలంటించారు.

అలాగే, మరో నేత ఎం మురుగానందమ్ బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యం, నిజాయతీ లేకపోవడమే పార్టీ నుంచి తప్పుకోడానికి కారణమని తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘నిజాయతీ, స్వతంత్రంగా ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో ఎంఎన్ఎంలో చేరా.. కానీ, ఈ రోజున అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు మురుగానందమ్ పేర్కొన్నారు. ఇక ఇప్పటికే వ్య‌క్తిగ‌త కార‌ణాల‌ను సాకుగా చూపి ఎంఎన్ఎం ఉపాధ్య‌క్షుఎడు ఆర్ మ‌హేంద్ర‌న్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంతోష్ బాబు, ప‌ద్మ ప్రియ పార్టీని వీడారు.