Covid Vaccine : కరోనా నుంచి కోలుకున్న వెంటనే వ్యాక్సిన్ తీసుకోవచ్చా? 6నెలల వరకు భయం లేదా?

మన దేశంలోనూ పెద్ద ఎత్తున టీకా కార్యక్రమం నడుస్తోంది. ఈ క్రమంలో పలు సందేహాలు, ప్రశ్నలు, అనుమానాలు, భయాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో ఒక ప్రధాన సందేహం.. కరోనా నుంచి కోలుకున్న వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? లేదా? ఇప్పుడు అందరిని వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది. దీనికి సంబంధించి నిపుణులు ఏమంటున్నారు అంటే...

Covid Vaccine : కరోనా నుంచి కోలుకున్న వెంటనే వ్యాక్సిన్ తీసుకోవచ్చా? 6నెలల వరకు భయం లేదా?

Covid Vaccine

Covid Vaccine : ప్రస్తుతం యావత్ ప్రపంచానికి కరోనావైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. వ్యాక్సిన్ వచ్చినా కరోనా భయాలు మాత్రం తగ్గడం లేదు. సెకండ్ వేవ్ లో కరోనా మరింతగా రెచ్చిపోతోంది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో అన్ని దేశాలు కరోనా కట్టడికి చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి.

మన దేశంలోనూ పెద్ద ఎత్తున టీకా కార్యక్రమం నడుస్తోంది. ఈ క్రమంలో పలు సందేహాలు, ప్రశ్నలు, అనుమానాలు, భయాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో ఒక ప్రధాన సందేహం.. కరోనా నుంచి కోలుకున్న వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? లేదా? ఇప్పుడు అందరిని వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది. దీనికి సంబంధించి నిపుణులు ఏమంటున్నారు అంటే…

”కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి కోలుకున్న వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు తొందరపడకూడదు. కోవిడ్ నుంచి కోలుకున్నాక కనీసం 4 నుంచి 8 వారాల వరకు టీకా అవసరం లేదు. కరోనా బారిన పడి కోలుకున్న 85శాతం మంది శరీరంలో యాంటీబాడీస్‌ ఉత్పత్తి అయి ఉంటాయి. మిగతా వారిలో టీ సెల్‌ ఆధారిత రక్షణ ఉంటుంది. ఈ దశలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ అవసరం లేదు. మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుంది” అని నిపుణులు చెబుతున్నారు.

అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) ప్రకారం 90 రోజులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం 6 నెలల వరకు కూడా వ్యాక్సినేషన్‌ వాయిదా వేసుకోవచ్చు. వాస్తవానికి చాలా దేశాల్లో కరోనా పాజిటివ్‌ తర్వాత ఎప్పుడు వ్యాక్సిన్‌ వేయించుకోవాలా అన్నదానిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా విధానాలు ఉన్నాయి.

మొత్తంగా కరోనా పాజిటివ్‌ నుంచి కోలుకున్నామంటేనే మనలో రక్షణ ఏదో ఒక రూపంలో (బీ లేదా టీ సెల్‌) ఉంటుంది. అంటే మళ్లీ కరోనా వచ్చే అవకాశం దాదాపు 6 నెలల వరకు తక్కువే. ఆ తర్వాత వ్యాక్సిన్‌ వేయించుకుంటే సరిపోతుంది అనేది డాక్టర్ల మాట.

చివరగా చెప్పేది ఏంటంటే.. అధ్యయనాలు చెబుతున్న దాని ప్రకారం వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఇక కరోనా రాదు అనేది లేదు. కరోనా రావచ్చు.. రాకపోవచ్చు.. కానీ, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారి నుంచి కరోనా వ్యాపించదు అని నిపుణులు చెబుతున్నారు. అంటే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు ట్రాన్స్‌మిటర్లుగా మాత్రం ఉండట్లేదు.