Sharad Pawar : ప్రత్యామ్నాయ కూటమిలో కాంగ్రెస్ ఉండాల్సిందే

దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తే అందులో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిందేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.

Sharad Pawar : ప్రత్యామ్నాయ కూటమిలో కాంగ్రెస్ ఉండాల్సిందే

Pawar

Sharad Pawar దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తే అందులో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిందేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎనిమిది రాజకీయ పార్టీల నేతలతో ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన భేటీపై పవార్ స్పందిస్తూ.. కూటమి విషయం గురించి తమ మధ్య చర్చ జరగలేదన్నారు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా ప్రత్నాయ్నాయ కూటమి ఏర్పాటు చేస్త కాంగ్రెస్‌తో కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందన్నారు. మనకు అలాంటి అధికారమే కావాల్సి ఉందని సమావేశంలో విపక్ష నేతలతో తాను చెప్పానని అన్నారు.

అయితే కొత్త ఫ్రంట్ కు మీరు నాయకత్వం వహించబోతున్నారా అన్న ప్రశ్నకు.. ఏదైనా ఫ్రంట్ కు సంబంధించి సామూహిక నాయకత్వం(collective leadership)ఉండాలని పవార్ సమాధానమిచ్చారు. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ ఒంటరి పోటీ చేస్తుందన్న వ్యాఖ్యలపై పవార్ స్పందించారు. ప్రతి రాజకీయ పార్టీకి తమ పార్టీని విస్తరించుకోవాలనే ఆలోచన ఉంటుంది. అందుకే ఎవరికివారు తమకు అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే చేయొచ్చు.. అది వారి హక్కు అని పవార్ అన్నారు.

కాగా,గడిచిన కొన్ని వారాలుగా ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్-పవార్ ల మధ్య వరుస మీటింగ్ లు,విపక్ష నేతలు-పవార్ మధ్య మీటింగ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే విపక్ష నేతల మీటింగ్ కు కాంగ్రెస్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.