జూన్-1 నుంచి…విద్యార్థులు ఉన్నచోటే సీబీఎస్ఈ పరీక్షలు

  • Published By: venkaiahnaidu ,Published On : May 27, 2020 / 03:57 PM IST
జూన్-1 నుంచి…విద్యార్థులు ఉన్నచోటే సీబీఎస్ఈ పరీక్షలు

సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి కేంద్రం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. COVID-19 కారణంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ అన్ని రాష్ట్రాల్లో స్కూల్ మూసివేయబడినప్పుడు చాలామంది విద్యార్థులు ఉన్నచోట నుంచి సొంత రాష్ట్రాలకు లేదా జిల్లాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 10 మరియు 12 తరగతుల విద్యార్థులు ఉన్నచోటనే పెండింగ్‌లో ఉన్న బోర్డు పరీక్షలకు హాజరుకావచ్చని కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ బుధవారం ప్రకటించారు.

స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిన విద్యార్థులు ఎవ‌రూ తాము చ‌దువుతున్న పాఠ‌శాల‌ల‌కు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని, వారు ప్ర‌స్తుతం ఎక్క‌డైతే ఉన్నారో అక్క‌డే ప‌రీక్ష‌లు రాసుకోవ‌చ్చ‌ని తెలిపారు. స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిన విద్యార్థులంద‌రూ తాము ప్ర‌స్తుతం ఉన్న చిరునామా వివ‌రాల‌ను వారివారి పాఠ‌శాల‌ల‌కు తెలియ‌జేయాల‌ని కేంద్ర‌మంత్రి పోఖ్రియాల్ కోరారు. విద్యార్థులు ఇచ్చే స‌మాచారం ఆధారంగా పాఠ‌శాల యాజ‌మాన్యాలు వారికి ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తాయ‌ని మంత్రి చెప్పారు. లాక్ డౌన్ కారణంగా పెండింగ్ లో పడిన సీబీఎస్ఈ పరీక్షలు జూన్-1నుంచి15వరకు జరగనున్నాయి