Central Bank Of India : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి బ్యాంకు అదిరిపోయే ఆఫర్

కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సిన్. దీంతో ప్రజలంతా టీకా తీసుకునేలా కేంద్ర ప్ర‌భుత్వం ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 10 కోట్లు దాటింది. వ్యాక్సిన్ తీసుకునే కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వమే కాదు పలు సంస్థ‌లూ తమ వంతు కృషి చేస్తున్నాయి. ఆఖరికి హోట‌ళ్లు, ప‌బ్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటుండ‌గా.. తాజాగా ఓ బ్యాంక్ కూడా రంగంలోకి దిగింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఆ బ్యాంక్ అదిరిపోయే ఆఫర్ తెచ్చింది.

Central Bank Of India : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి బ్యాంకు అదిరిపోయే ఆఫర్

Central Bank Of India

Central Bank Of India : కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సిన్. దీంతో ప్రజలంతా టీకా తీసుకునేలా కేంద్ర ప్ర‌భుత్వం ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 10 కోట్లు దాటింది. వ్యాక్సిన్ తీసుకునే కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వమే కాదు పలు సంస్థ‌లూ తమ వంతు కృషి చేస్తున్నాయి. ఆఖరికి హోట‌ళ్లు, ప‌బ్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటుండ‌గా.. తాజాగా ఓ బ్యాంక్ కూడా రంగంలోకి దిగింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఆ బ్యాంక్ అదిరిపోయే ఆఫర్ తెచ్చింది.

ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న‌వారికి ఎఫ్‌డీలపై(ఫిక్స్డ్ డిపాజిట్) ఎక్కువ వడ్డీని అందిస్తున్న‌టు ప్ర‌క‌టించింది. సాధార‌ణ ఖాతాదారుల‌తో పోలిస్తే.. వ్యాక్సిన్ తీసుకున్న ఖాతాదారులు.. త‌మ ఎఫ్‌డీల‌పై 0.25 శాతం వరకు అధిక వడ్డీని పొందే ఆఫ‌ర్ తెచ్చింది. ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్‌ను లాంచ్ చేసిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 1,111 రోజుల కాల పరిమితితో ఈ ఎఫ్‌డీ స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో డబ్బులు పెడితే 25 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీని సొంతం చేసుకోవచ్చు. క‌రోనా వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ వ‌ర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడేళ్ల డిపాజిట్లపై 5.1శాతం రిటర్న్ ఇస్తోంది. ఈ స్పెషల్ స్కీమ్ తో ఆ రిటర్న్ 5.35శాతానికి పెరిగింది. ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకుని ఈ లిమిటెడ్ ఆఫర్ ని సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు వర్గాలు కోరాయి. సీనియర్ సిటిజన్లు అయితే అదనపు వడ్డీని పొందొచ్చని బ్యాంకు అధికారులు తెలిపారు.