Biometric Attendance : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ రద్దు… కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును

Biometric Attendance : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ రద్దు… కేంద్రం కీలక నిర్ణయం

Biometric Attendance

Biometric Attendance : దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని చెప్పింది. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, గతేడాది కూడా కరోనా ఉధృతి నేపథ్యంలో బయోమెట్రిక్ ను రద్దు చేసిన కేంద్రం.. నవంబర్ లో పునరుద్దరించింది.

Tea : పిల్లలు టీ తాగటం ఆరోగ్యానికి మంచిదేనా?

కాగా, బయోమెట్రిక్ అటెండెన్స్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్ బుక్ లో తప్పనిసరిగా సంతకాలు చేయాలని ఉద్యోగులకు, అధికారులకు కేంద్రం సూచించింది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ రద్దు చేయడం జరిగింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా కేంద్రం ఈ ఈ నిర్ణయం తీసుకుంది” అని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు.

గడిచిన ఆరు నెలలుగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతూ వచ్చాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ఇప్పుడు మళ్లీ ఆందోళనకర రీతిలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కేంద్రం మరోసారి కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. నిన్న దేశంలో 33వేల 750 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 123 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. అలాగే, నిన్న‌ 10వేల 846 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.

YSR Rythu Bharosa : రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి

దేశంలో ప్ర‌స్తుతం 1,45,582 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,42,95,407గా ఉంది. 4,81,893 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయార‌ు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,45,68,89,306 క‌రోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.