బిగ్ డెవలప్ మెంట్ : ఇండియాలో A.K.47 గన్స్ తయారీ

బిగ్ డెవలప్ మెంట్ : ఇండియాలో A.K.47 గన్స్ తయారీ

మేడిన్ ఇండియాలో సంచలనం.  శక్తివంతమైన కలష్నికోవ్ రైఫిల్స్  తయారీ ఇకపై భారత్ లో కూడా జరిగే విధంగా మోడీ సర్కార్ చర్యలు చేపట్టింది. అది కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలో ఈ తయారీ ప్రపోజల్ కి బుధవారం(ఫిబ్రవరి-13,2019)   కేంద్రం పచ్చజెండా ఊపింది. అమేథీ జిల్లాలోని కోర్వా సిటీలోని ఫ్లాంట్ లో రష్యా జాయింట్ వెంచర్ సంస్థ, ఆర్డ్ నాన్స్ ఫ్యాక్టరీ బోర్డు(OFB)లు సంయుక్తంగా  దాదాపు 7.5 లక్షల దాడి రైఫిల్స్ తయారీ చేయనున్నాయి.

ఈ జాయింట్ వెంచర్ లో మెజార్టీ స్టేక్ హోల్డర్ గా 50.5 శాతంతో ఓఎఫ్ బీ ఉండగా, రష్యా 49.5శాతం కలిగా ఉంది. 7.62×39 mm క్యాలిబర్ AK-203 గన్స్ కోర్వా ఫ్లాంట్ అందిచనుంది. ఫేమస్ AK-47రైఫిల్స్ కి సంబంధించిన డీల్ కూడా శుక్రవారం(ఫిబ్రవరి-15,2019) దీనికి లింక్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి-28న ప్రధాని నరేంద్రమోడీ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం రైఫిల్స్ తయారీకి 100 శాతం లోకల్ కంటెంట్ ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

అంతేకాకుండా ఫాస్ట్-ట్రాక్ విధానాల కింద అమెరికా నుంచి 72వేల సిగ్ సౌర్ 716 దాడి రైఫిల్స్ ను పొందేందుకు కాంట్రాక్ట్ పై భారత్ సంతకం చేసింది. దాదాపు 3వేల600 కిలోమీటర్ల పొడవైన చైనా బోర్డర్ లో ఉన్న దళాలు ఈ రైఫిల్స్ ను వాడనున్నాయి.