Cow Dung: ఆవు పేడే వారి ఆదాయం! వ్యాపారంలో దూసుకుపోతున్న అతివలు

ఒకప్పుడు అవతల పారేసే ఆవుపేడనే ఆదాయం వనరుగా మార్చుకున్నారు మహిళలు. ఆవుపేడతో ఎన్నో రకాల ఉత్పత్తులు తయారుచేసి వాటిని ఆన్ లైన్ లో అమ్ముతు చక్కటి ఆదాయాన్ని పొందుతున్నారు.

Cow Dung: ఆవు పేడే వారి ఆదాయం! వ్యాపారంలో దూసుకుపోతున్న అతివలు

Cow Dung From Farmers

chhattisgarh womens buy cow dung difarant type of farmers : ఇంట్లో పాడి ఉంటే ఇల్లాలికి ఒంటినిండా పనే కాదు ..చేతిలో డబ్బులు కూడా ఉంటాయి. ఇంట్లో చిల్లర ఖర్చుల కోసం పిల్లల అవసరాల కోసం పాడి డబ్బులనే వాడుకుంటారు ఇల్లాళ్లు. కానీ పాడితో పాలు, పెరుగు, వెన్న, నెయ్యిల అమ్మకాలే కాదు పేడతో కూడా డబ్బులు సంపాదించేస్తారు అతివలు. ముఖ్యంగా ఆవుపేడకు ఇటీవల కాలంలో డిమాండ్ బాగా పెరిగింది. దీంతో అతివలు ఇంట్లో ఉండే ఆవుపేడను అవతల పారేయకుండా ఆవుపేడనే ఆదాయవనరుగా మార్చుకున్నారు ఛత్తీస్ ఘడ్ మహిళలు. ఆవుపేడతో పిడకలే కాదు..సృజనాత్మకతకు పదును పెట్టి రకరకాల ఉత్పత్తులు తయారుచేస్తున్నారు.వాటిని అమ్ముతూ చక్కగా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు ఛత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలోని కొన్ని గ్రామాల మహిళలు.

మావోయిస్టుల తుపాలకుల మోతతో దద్దరిల్లే ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని మహిళల సృజనాత్మకత ఆలోచనలతో దేశంలోని ఎన్నో ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది. రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలోని..
చౌరియా, అంబగోర్, తహ్‌షిల్, గుమ్కా, సింఘాల, తెందెసాల్‌ లతో పాటు మరికొన్ని ఎన్నో గ్రామాల్లోని ఆడవారికి ఆవు పేడ ఆదాయ వనరుగా మారింది. ఆయా గ్రామాల్లోని మహిళలు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ఆవుపేడతో పిడకలే కాకుండా విగ్రహాలు, మొబైల్‌ ఫోన్‌స్టాండ్లు, నర్సరీ పాట్స్‌ వంటి ఎన్నో ఉత్పత్తులు తయారు చేస్తు వాటిని మార్కెట్ లో అమ్ముతూ చక్కటి ఆదాయం పొందుతున్నారు. ఒకప్పుడు ఈ ఆవుపేడతో తయారు చేసిన ఉత్పత్తుల మార్కెట్‌ జిల్లా సరిహద్దులకే పరిమితంగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఇ–కామర్స్‌ వేదికల పుణ్యమా అని అంతర్జాతీయస్థాయికి చేరింది ఆవుపేడ ఉత్పత్తుల మార్కెట్. రోజురోజుకు ఇవి ఆన్‌లైన్‌ మార్కెట్‌ లో అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. దీంతో అతివల సంపాదన ఇంటికి చక్కటి ఆదాయ వనరుగా మారింది. ఒకప్పుడు ఆవుపేడతో వ్యాపారమా?అన్నవారే ఇప్పుడు ఆవుపేడే ఆదాయం అంటున్నారు. ఆవుపేడే లక్ష్మీదేవి అంటున్నారు.

అలా ఆవుపేడతో వ్యాపారం చేసే అంబగోర్ గ్రామానికి చెందిన సబిత అనే మహిళ మాట్లాడుతూ..‘ఒకప్పుడు మా పొరుగింటి ఆవిడ పేడ వ్యాపారం గురించి చెబితే నవ్వాను..పేడతో వ్యాపారమా? డబ్బుల సంపాదనా?అని నవ్వానని..కానీ ఇప్పుడు ఆ ఆవుపేడే మాకు ఆదయాంగా మారింది’ అని తెలిపింది. కాగా..ఆవు పేడ వ్యాపారాన్ని అధ్యయనం చేయడానికి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ వంటి ఎన్నో రాష్ట్రాల నుంచి మహిళలు ఎంతోమంది బృందాలుగా ఛత్తీస్ ఘడ్ లోని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాకు వస్తుంటారు. ఆయా గ్రామాల్లోని మహిళ నుంచి ఎన్నో విషయాలుఅడిగి తెలుసుకుంటారు. అధికారులు కూడా వస్తుంటారు.

ఉత్తరప్రదేశ్‌లో అపర్ణ అనే అడ్వకేట్ తన వృత్తికి స్వప్తి చెప్పి ఆవుపేడ వ్యాపారంలోకి దిగారు. అలా తన వ్యాపారం కోసం గౌతమబుద్ధనగర్‌ జిల్లాలో 10 ఎకరాల విస్తీర్ణంలో గోశాల నిర్వహిస్తు..దాదాపు 130 ఆవుల్ని పెంచుతున్నారు. వాటిపేడతో రకరకాల వస్తువులు తయారుచేసి మార్కెట్‌లో విక్రయిస్తు లాయర్ గా ఉన్నప్పటి సంపాదన కంటే ఎక్ువగా సంపాదిస్తున్నారు. అపర్ణ తన వద్దకు వచ్చే మహిళలకు ‘ఆవుపేడతో ఎలాంటి వస్తువులు తయారుచేయవచ్చు?’ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?’‘మార్కెట్‌ ఎలా చేసుకోవాలి? పేడ నుంచి వర్మీ కంపోస్ట్‌ ఎలా తయారు చేస్తారు?వంటి విషయాల్లో సలహాలు ఇస్తుంటారు. మార్కెట్ చేసుకోవాటానికి మెళకువలు చెబుతుంటారు. ఇలా ఆవుపేడతో ఉత్పత్తులు తయారు చేసి అమ్మే మహిళలు మాట్లాడుతు..‘ఆవుపేడ ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని చెబుతున్నారు.

పంజాబ్‌లోని బులందపూర్‌లాంటి పలు గ్రామాల్లో గతంలో ఆవుపేడను పారేసేవారు. కానీ ఇప్పుడలా కాదు ఆవుపేడను బంగారంతో సమానంగా చూసుకుంటున్నారు.పేడను జాగ్రత్త చేస్తున్నారు. 10 మంది మహిళలు ఒక బృందంగా ఏర్పడి పిడకలతో పాటు రకరకాల వస్తువులు తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే ఎన్నో మహిళాబృందాలు పయనిస్తున్నాయి. ఆవుపేడను ఆదాయ వనరుగా మార్చుకుని పయనిస్తున్నారు.