Chinese brutality: కళ్ళకు గంతలు కట్టి, కరెంటు షాక్ ఇచ్చారు: అరుణాచల్ యువకుడు

జనవరి 18న అపహరణకు గురైన మిరమ్.. దాదాపు ఎనిమిది రోజుల పాటు చైనా సైనికుల వద్ద బందీగా ఉన్నాడు. చైనా సైనికులు.. కళ్లకు గంతలు కట్టి కరెంటు షాక్ ఇచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.

Chinese brutality: కళ్ళకు గంతలు కట్టి, కరెంటు షాక్ ఇచ్చారు: అరుణాచల్ యువకుడు

Miram

Chinese brutality: చైనా భద్రత బలగాలచే ఇటీవల అపహరణకు గురైన అరుణాచల్ యువకుడు.. మిరమ్ తరోన్ చైనా సైనికుల క్రూరత్వాన్ని బయటపెట్టాడు. చైనా భద్రత సిబ్బంది మాటువేసి తనను తన మిత్రుడిని అపహరించేందుకు వచ్చారన్న మిరమ్.. తన మిత్రుడు చాకచక్యంగా తప్పించుకోగా.. తానూ మాత్రం వారి చేతికి చిక్కినట్లు తెలిపాడు. తనను బందీగా పట్టుకున్న చైనా సైనికులు.. కళ్లకు గంతలు కట్టి కరెంటు షాక్ ఇచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. జనవరి 18న అపహరణకు గురైన మిరమ్.. దాదాపు ఎనిమిది రోజుల పాటు చైనా సైనికుల వద్ద బందీగా ఉండి.. జనవరి 27న తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు. ఈసందర్భంగా పలు జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులు మిరమ్ తరోన్ ను కలిశారు.

Also read: Vijayawada Police: పీఆర్సీ ర్యాలీ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు 

అరుణాచల్ ప్రదేశ్ లోని సియాంగ్ జిల్లా జీదో గ్రామానికి చెందిన మిరమ్ తరోన్ తన మిత్రుడితో కలిసి జనవరి 18న భారత్ – చైనా సరిహద్దు ప్రాంతమైన లాంగ్టా జోరు(అరుణాచల్ భూభాగం)లో కుందేళ్ళ వేటకు వెళ్ళాడు. సాయంత్రం 6:30 తరువాత ఇంటికి బయలుదేరుదామనుకున్న మిరమ్ అతని మిత్రుడు.. చీకటి కారణంగా అక్కడక్కడే తిరుగుతున్నారు. అదే సమయంలో చైనా సైనికులు(15 మంది) వచ్చి మిరమ్ ను పట్టుకుని, కళ్ళకు గంతలు కట్టి తమ క్యాంపులో బంధించారు. విషయం తెలుసుకున్న అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ గావో.. విషయాన్నీ కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం భారత్ – చైనా ఆర్మీల ఉన్నతాధికారులు చర్చల అనంతరం జనవరి 26న మిరమ్ ను అప్పగించేందుకు అంగీకారం జరగ్గా.. జనవరి 27న మిరమ్ తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు.

Also Read: APSRTC Employees : సమ్మెలో పాల్గొనడం లేదు : ఆర్టీసీ ఉద్యోగులు

అయితే తాను చైనా సరిహద్దుల్లోకి వెళ్లలేదని.. చైనా సైనికులే తమను ముందు నుంచి కనిపెట్టుకుని కూర్చున్నట్లు మిరమ్ చెప్పుకొచ్చాడు. అపహరణకు గురైన నాటి నుంచి తన కళ్లకు కట్టిన గంతలను చైనా సైనికులు విప్పలేదని.. తనను బూటు కాళ్ళతో తన్నినట్లు తెలిపాడు. ఒకరోజు కరెంటు షాక్ ఇచ్చినట్లు వివరించిన మిరమ్.. ఇక తాను బ్రతుకుతాననే అసలు కోల్పోయినట్లు పేర్కొన్నాడు. ఒకరోజు అనంతరం అన్నం, చికెన్ కూర పెట్టినట్లు మిరమ్ తెలిపాడు. అయితే అన్ని రోజులు కళ్లకు గంతలు మాత్రం విప్పలేదని.. కనీసం మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చినా ఎవరో ఒకరు తోడు వచ్చేవారని పేర్కొన్నాడు.

Also read: Vijayasai Reddy: టీటీడీ ఎఫ్‌సిఆర్‌ఎను పునరుద్ధరించండి: కేంద్ర హోంశాఖకు విజయసాయి రెడ్డి విజ్ఞప్తి