Arunachal Teen : అరుణాచల్ ప్రదేశ్ బాలుడు సేఫ్!

టారోన్ మరికొంత మందితో కలిసి రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో మూలికల వేటకు వెళ్లాడ‌ని జిల్లా అధికారులు తెలిపారు. మిగ‌తా వారు త‌ప్పించుకోగా టారోన్‌ను పీఎల్ఏ నిర్బంధించింద‌ని ఆరోపించారు

Arunachal Teen : అరుణాచల్ ప్రదేశ్ బాలుడు సేఫ్!

Arunachal

Chinese PLA Finds Missing Teen : బార్డర్‌లో మిస్సింగ్‌ కలకలం.. మూడ్రోజుల పాటు టెన్షన్‌ టెన్షన్‌.. అరుణాచల్‌ ప్రదేశ్ బార్డర్‌లో బాలుడు మిస్సయ్యాడా? లేక చైనా కిడ్నాప్‌ చేసిందా.. అన్న వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. తమ వద్దే బాలుడు సురక్షితంగా ఉన్నట్లు చైనా ఆర్మీ… భారత రక్షణశాఖకు సమాచారం ఇచ్చింది. ఇండియా-చైనా సరిహద్దులో తప్పిపోయిన అరుణాచల్‌ప్రదేశ్‌ 17 ఏళ్ల బాలుడు ఆచూకీ లభ్యమైంది. మూడ్రోజుల తర్వాత మిరాన్‌ టారోన్‌ కనిపించాడని చైనా ఆర్మీ తెలిపింది. దీంతో ఆ బాలుడిని అప్పగించేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నట్లు ఇండియన్‌ ఆర్మీకి సమాచారం ఇచ్చింది. వారం రోజుల్లో మిరాన్‌ టారోన్‌ను చైనా.. భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది.

Read More : Cryptocurrency Update: పతనమైన క్రిప్టోకరెన్సీ.. భారీ నష్టాల్లో బిట్‌కాయిన్!

అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్‌ జిల్లా జిడో గ్రామానికి చెందిన మిరాన్‌ టారోన్‌ ఈనెల 19 నుంచి కనిపించకుండా పోయాడు. అయితే ఆ బాలుడిని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్‌ ఆర్మీ కిడ్నాప్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ ఎంపీ తాపిర్‌ కూడా బాలుడిని చైనా కిడ్నాప్‌ చేసిందని… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. మిరామ్‌ను త్వరగా విడిపించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు టారోన్ మరికొంత మందితో కలిసి రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో మూలికల వేటకు వెళ్లాడ‌ని జిల్లా అధికారులు తెలిపారు. మిగ‌తా వారు త‌ప్పించుకోగా టారోన్‌ను పీఎల్ఏ నిర్బంధించింద‌ని ఆరోపించారు.

Read More : Ind Vs SA : మూడో వికెట్ కోల్పోయిన భారత్, పంత్ డకౌట్

బాలుడి కిడ్నాప్‌తో రంగంలోకి దిగిన భారత రక్షణశాఖ… తప్పిపోయిన బాలుడి గురించి ఆరా తీసింది. వెంటనే పీఎల్ఏని సంప్రదించింది భార‌త ఆర్మీ. బాలుడి ఆచూకీని క‌నుగొన‌డంలో స‌హ‌క‌రించాల‌ని కోరింది. అయితే, ఆ బాలుడు త‌మ ఆధీనంలో లేడ‌ని, అత‌డి గురించి ఎలాంటి స‌మాచారం త‌మ వ‌ద్ద లేద‌ని పీఎల్ఏ తొలుత బుకాయించింది. బాలుడు పీఎల్ఏ ఆధీనంలోనే ఉన్న సంగ‌తి బ‌య‌ట‌ప‌డ‌టంతో అత‌డి ఆచూకీని క‌నుగొన్నట్లు భార‌త ఆర్మీకి తెలిపింది. ఇదే విషయాన్ని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. దీంతో బాలుడి తల్లిదండ్రులతో పాటు అరుణాచల్‌ప్రదేశ్‌ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.