Commercial LPG cylinder Price : గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది.. ఈరోజు నుంచే కొత్త రేట్లు..!

Commercial LPG cylinder Price : గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఈ రోజు (మార్చి 1 నుంచే) కొత్త రేట్లు అమల్లోకి వచ్చేశాయి.

Commercial LPG cylinder Price : గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది.. ఈరోజు నుంచే కొత్త రేట్లు..!

Commercial Lpg Cylinder Prices Hiked By Rs 105. Check New Rates

Commercial LPG cylinder Price : గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఈ రోజు (మార్చి 1 నుంచే) కొత్త రేట్లు అమల్లోకి వచ్చేశాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మళ్లీ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల చాలామందిపై తీవ్రప్రభావం పడనుంది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.105 వరకు పెరిగింది.

పెరిగిన కొత్త ధరలు కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు (19 కేజీలు) మాత్రమే.. మిగతా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (14.2 కేజీలు) ధరలో ఎలాంటి మార్పులు లేదు. ప్రస్తుత గ్యాస్ ధరను కూడా పెంచలేదు.. సామాన్యులకు ఊరట కలిగించే విషయంగానే చెప్పవచ్చు.మరోవైపు 5 కేజీల సిలిండర్ ధర (LPG cylinder Price) పెరిగి రూ.27పైనే చేరింది. ఈ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.569కు పెరిగింది.

2021 అక్టోబర్ నుంచి 14.2 కేజీల సిలిండర్ ధర మారలేదు. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 102 డాలర్లకు చేరాయి. దాంతో రానున్న రోజుల్లో ఈ డొమెస్టిక్ సిలిండర్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర
పెరగుతూ పోతోంది.

Commercial Lpg Cylinder Prices Hiked By Rs 105. Check New Rates (1)

Commercial Lpg Cylinder Prices Hiked By Rs 105. Check New Rates 

2021 అక్టోబర్ నుంచి ఈ ఏడాది 2022 ఫిబ్రవరి 1 వరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ చాలాసార్లు పెరిగింది. ప్రస్తుతం ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ.170 వరకు పెరిగింది. అక్టోబర్ 1న సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1736గా ఉంది. అదే నవంబర్‌లో రూ.2 వేలకు పెరిగింది. డిసెంబర్‌లో రూ.2,101కు పెరిగింది.

జనవరి, ఫిబ్రవరిలో మాత్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (Commercial LPG cylinder Price) ధర రూ.1907కు దిగివచ్చింది. గ్యాస్ ధర తగ్గినప్పటికీ.. మళ్లీ సిలిండర్ ధర పెరిగింది. ఈ సిలిండర్ ధర రూ.2012కు పెరిగింది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.1987 ఉండగా.. రూ.2095కు పెరిగింది. ముంబైలో సిలిండర్ ధర రూ.1857 నుంచి రూ.1963కు ఎగసింది. మార్చి 7 తర్వాత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మార్చి 7న యూపీలో ఏడో విడత ఎన్నికలు ముగియనున్నాయి. ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్లీ గ్యాస్ సిలిండర్‌ను పెంచవచ్చుననే మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర కూడా భారీగా పెరుగుతాయని అంటున్నారు. అనుకున్నట్టుగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయో లేదో చూడాలి.

Read Also : LPG Price Hike : భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. సిలిండర్‌పై రూ.266 పెంపు!