Congress : ఇంధన ధరల పెరుగుదల..దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశవ్యాప్త నిరసనలు నిర్వహించింది.

Congress : ఇంధన ధరల పెరుగుదల..దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన

Co

Congress పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశవ్యాప్త నిరసనలు నిర్వహించింది. కేరళ,ఢిల్లీ,యూపీ,బీహార్,కర్ణాటక,జమ్మూకశ్మీర్,పంజాబ్,హర్యానా సహా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్​ బంకుల వద్ద.. కాంగ్రెస్ కార్యకర్తలు ప్లకార్డులతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఇంధన ధరలను తగ్గించి, వాటిని జీఎస్టీ పరిధిలో చేర్చాలని డిమాండ్​ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించలేదంటూ.. ఢిల్లీలోని వివిధ పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు చేస్తోన్న 30మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దేశంలోని సామాన్య ప్రజలను మోడీ ప్రభుత్వం లూటీ చేయడం మానాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. గత ఐదు నెలల్లో ఇంధనం ధరలు 44 రెట్లు పెరిగాయన్నారు. ఒకవైపు కోవిడ్ మహమ్మారితో ప్రజలు బాధపడుతుండే, మరో వైపు కేంద్రం ఇంధనం ధరలు పెంచుకుండా పోతోందని మండిపడ్డారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు.. పెట్రోల్​, డీజిల్​పై పన్ను రూ.9.20గా ఉండేదని.. కానీ ప్రస్తుతం అది రూ.32గా ఉందన్నారు.

ఇంధనం ధరలపై ఎక్సైజ్ డ్యూటీ అనేక సార్లు పెంచుకుంటూ పోవడం వల్ల 250కి పైగా నగరాల్లో పెట్రోల్ ధర లీటరు రూ.100 దాటిపోయిందని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. పెట్రోల్​, డీజీల్​పై ఎక్సైజ్​ సుంకాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని,ఇంధన ధరలను కూడా జీఎస్​టీ పరిధిలోకి తీసుకురావాలని తాము డిమాండ్​ చేస్తున్నామన్నారు.