Mamata Banerjee: మమత వ్యాఖ్యలపై కాంగ్రెస్ రియాక్షన్

యూపీఏ కూటమిపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

10TV Telugu News

Mamata Banerjee: యూపీఏ కూటమిపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అసలు యూపీఏ కూటమే లేదన్నారు మమతా బెనర్జీ. దేశ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న దీదీ.. ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది‌.

మమత బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా రియాక్ట్ అవుతోంది. కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఓడించాలనుకోవడం కలేనని, ఆ పార్టీ నాయకులు కేసి వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ లేకుంటే యూపీఏ ఆత్మలేని శరీరం అవుతుందన్నారు. ప్రతిపక్షాల ఐక్యతను చాటుకోవాల్సిన సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని కపిల్ సిబల్ అన్నారు. సామాజిక-రాజకీయ సమస్యలలో టీఎంసిని చేర్చడానికి ప్రయత్నించామని అన్నారు.

ప్రతిపక్షాలు చీలిపోయి తమలో తాము పోరాడకూడదు. ప్రతిపక్షాలన్ని కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలిని అన్నారు మల్లికార్జున్ ఖర్గే. మరోవైపు టీఎంసీ లీడర్లు కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్‌ తనని తాను ఎక్కువగా ఊహించుకుంటోందని ఫైర్‌ అవుతున్నారు టీఎంసీ లీడర్లు.

×