మీ వాహనంలో ప్యానిక్ బటన్ లేదా.. తిప్పలు తప్పవు!

ప్యాసింజర్ వెహికల్ కావొచ్చు. కమర్షియల్ వెహికల్ కావొచ్చు. మీ వాహనంలో జీపీఎస్ ఆధారిత ప్యానిక్ బటన్ ఉందా? లేదంటే అంతే సంగతులు.

  • Published By: sreehari ,Published On : January 1, 2019 / 11:23 AM IST
మీ వాహనంలో ప్యానిక్ బటన్ లేదా.. తిప్పలు తప్పవు!

ప్యాసింజర్ వెహికల్ కావొచ్చు. కమర్షియల్ వెహికల్ కావొచ్చు. మీ వాహనంలో జీపీఎస్ ఆధారిత ప్యానిక్ బటన్ ఉందా? లేదంటే అంతే సంగతులు.

  • బస్సులు, ఆటోలు, అన్ని క్యాబుల్లో జీపీఎస్ తప్పనిసరి 

  • జనవరి 1 నుంచే అమల్లోకి.. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటన 

ప్యాసింజర్ వెహికల్ కావొచ్చు. కమర్షియల్ వెహికల్ కావొచ్చు. మీ వాహనంలో జీపీఎస్ ఆధారిత ప్యానిక్ బటన్ ఉందా? లేదంటే అంతే సంగతులు. మీ వెహికల్ కు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేయరు. నేటి (జనవరి 1) నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చేసింది. ఏఐఎస్-140 (వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్) సర్టిఫై చేసి ఉండాలి. ఎమర్జెన్సీ బటన్ తప్పనిసరిగా అమర్చాలి. బస్సులు, ఆటోలు, అన్నీ క్యాబ్ లకు ప్యానిక్ బటన్ ఉండి తీరాల్సిందే. లేదంటే తిప్పలు తప్పవు. జీపీఎస్ అనుసంధానమైన ప్యానిక్ బటన్ ఆధారంగా క్యాబ్ లన్నీ పోలీసుల నిఘాలో ఉంటాయి. ఇటీవల క్యాబ్ లలో ప్రయాణించే మహిళలపై క్యాబ్ డ్రైవర్ల వేధింపులు ఎక్కువయ్యాయి. మహిళల భద్రత దృష్ట్యా జీపీఎస్ అనుసంధానమైన ప్యానిక్ బటన్ అమర్చాలని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వాహనంలో ప్యానిక్ బటన్ సాయంతో  ఆ వాహనం ఎక్కడికి వెళ్తుందో జీపీఎస్ విధానంతో ట్రాక్ చేయవచ్చు. 

బటన్ ప్రెస్ చేయడమే ఆలస్యం..  

వాహనంలోని ప్రయాణికులు ప్యానిక్ బటన్ పై ప్రెస్ చేస్తే చాలు.. క్షణాల్లో సమాచారం పోలీసులకు చేరిపోతుంది. వాహనం ఎక్కడ ఉంది ఎక్కడికి వెళ్లిందో సమాచారం ఇట్టే తెలిసిపోతుంది. ఈ విధానం ద్వారా రోడ్డు భద్రతతో పాటు వాహనంలోని ప్రయాణికులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు దోహదపడుతుందని కర్ణాటక రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ సేవలను జీపీఎస్ తో అనుసంధానం చేసి అమలు చేస్తున్నట్టు ఆర్టీఓ తెలిపింది. వాహనాలకు నిర్ణీత ప్రమాణాలు ఉన్నాయో లేదో ఆర్టీఓ నిర్ధారిస్తుంది. రిజిస్టర్ అయిన ప్రతివాహనానికి సంబంధించిన సమాచారం ఆర్టీఓ పోర్టల్స్ లో రికార్డు చేస్తారు.

దీని ఆధారంగా ప్రయాణికులు ఎవరైనా వాహనంలోని ప్యానిక్ బటన్ నొక్కితే చాలు.. వెంటనే వెహికల్ సమాచారం ఈ కంట్రోల్ వ్యవస్థకు చేరిపోతుంది. అక్కడి అధికారులు వెంటనే స్పందించి వెహికల్ మూమెంట్స్ ను ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తుంటారు. గతంలో క్యాబ్ డ్రైవర్లు మహిళలను వేధించిన ఘటనలపై పలు కేసులు నమోదయ్యాయి. గత ఏడాది జూలైలో బెంగళూరులో మహిళా ఫ్యాసింజర్ ను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. చివరికి ఓలా క్యాబ్ డ్రైవర్ గా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కర్ణాటక రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ దిశగా చర్యలు చేపట్టింది.