Corona 4th Wave: దేశంలో కరోనా నాలుగో దశ రానుందా?: నిపుణులు ఏమంటున్నారంటే

ఇతర దేశాల నుంచి వస్తే తప్పా, ద్దేశంలో XE వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం లేదన్న అరోరా..అలంటి పరిస్థితి వస్తే భారత్ లో జూన్ - జులై మధ్య కరోనా నాలుగో దశ ఉంటుందని పేర్కొన్నారు

Corona 4th Wave: దేశంలో కరోనా నాలుగో దశ రానుందా?: నిపుణులు ఏమంటున్నారంటే

Corona

Corona 4th Wave: దేశంలో కరోనా మహమ్మారి పీడా ఇంకా తొలగిపోలేదు. మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందో తెలియదు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అంటూ ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజల నుద్దేశించి సూచనలు చేశారు. కరోనా నియంత్రణ నిమిత్తం శరవేగంగా టీకాలు పంపిణీ చేస్తున్నా..కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉందని ప్రధాని వివరించారు. దీంతో దేశంలో కరోనా నాలుగో దశ వ్యాప్తి మరోసారి ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈక్రమంలో కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనే విషయంపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGEI) చీఫ్ డాక్టర్ NK అరోరా సోమవారం ఏఎన్ఐ ప్రతినిధితో మాట్లాడారు. దేశంలో ఒకటి రెండు చోట్ల బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్..తీవ్రమైన సంక్రమణకు దారితీయనందున ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని ఆయన అన్నారు.

Also read:Vitamin C : విటమిన్ సి కోసం నిమ్మకు ప్రత్యామ్నాయంగా!

ప్రస్తుతం భారత్ లో రెండు XE వేరియంట్ కేసులు మాత్రమే బయటపడ్డాయి. కొత్తగా నమోదు అవుతున్న కరోనా బాధితుల జినోమ్ సీక్వెన్స్ ను విశ్లేషిస్తే మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్రం వద్దనున్న కోవిడ్ సమాచారాన్ని విశ్లేషించిన మీదట..ఇండియాలో మహమ్మారి వ్యాప్తి అంత వేగంగా లేదని NK అరోరా వివరించారు. ఓమిక్రాన్ నుంచి కొత్త వేరియంట్లు అనేకం ఉత్పన్నం అవుతున్నాయని..x, XE వేరియంట్లు అలా వచ్చినవేనని..అయితే వైరస్ లలో కొత్త వేరియంట్లు పుట్టుకు రావడం సహజమేనని అరోరా అన్నారు. వీటిలో ఏవీ తీవ్రమైన వ్యాధులకు కారణం కానందున భయపడాల్సిన అవసరం లేదని NK అరోరా స్పష్టం చేశారు.

Also read:Taro Root : కొలెస్ట్రాల్, చక్కెర స్ధాయిలు తగ్గించే చామగడ్డలు

ఇతర దేశాల నుంచి వస్తే తప్పా, ద్దేశంలో XE వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం లేదన్న అరోరా..అలంటి పరిస్థితి వస్తే భారత్ లో జూన్ – జులై మధ్య కరోనా నాలుగో దశ ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటి వరకు వెలుగు చూసిన అన్ని వేరియంట్లలో Covid -19 XE వేరియంట్ ఆసియాలో తీవ్ర వ్యాప్తిలో ఉందని..నిత్యం 14 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు ఆసియా దేశాల్లో నమోదు అవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. చైనాలో ఇప్పటికే ఓమిక్రాన్ వేరియంట్ తీవ్ర వ్యాప్తిలో ఉండగా..మహమ్మారి కట్టడి నిమిత్తం చైనాలో లాక్ డౌన్ విధించారని WHO తెలిపింది.