Taro Root : కొలెస్ట్రాల్, చక్కెర స్ధాయిలు తగ్గించే చామగడ్డలు

గుండె జబ్బులు రాకుండా చేయటంతోపాటు రక్త ప్రసరణను మెరుగుపరిచి హైపర్ టెన్షన్‌ని తగ్గిస్తుంది. వీటిని తినటం వల్ల రోగనిరోధకశక్తికి పెరుగుతుంది.

Taro Root : కొలెస్ట్రాల్, చక్కెర స్ధాయిలు తగ్గించే చామగడ్డలు

Taro Root

Taro Root : దుంప కూరజాతుల్లో చేమ కూడా ఒకటి. చేమ దుంపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. చామగడ్డ పులుసు కూరను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. చామగడ్డలు జిగురు దనంతో ఉంటాయి. అయితే వీటిని శుభ్రం చేసి ఉడకబెట్టి తినటం అన్నది ఇబ్బంది కావటంతో ఎక్కువ మంది వీటిని తినేందుకు అంతాగా ఆసక్తి చూపరు. అనేక శారీరక రుగ్మతలకు చక్కని ఔషధంలా చేమదుంపలు పనిచేస్తాయి. అధిక శరీర బరువును తగ్గించేందుకు దోహదపడతాయి. చామగడ్డల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండడమే కాకుండా సోడియం శాతం తక్కువగా ఉంటుంది.. ఈ ఆహారం నిదానంగా జీర్ణంమై నెమ్మదిగా శరీరానికి శక్తినిస్తుంది. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

శరీరం ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేసి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండేలా చేస్తుంది. గుండె జబ్బులు రాకుండా చేయటంతోపాటు రక్త ప్రసరణను మెరుగుపరిచి హైపర్ టెన్షన్‌ని తగ్గిస్తుంది. వీటిని తినటం వల్ల రోగనిరోధకశక్తికి పెరుగుతుంది. చామగడ్డలో విటమిన్- ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, సి లతోపాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలతోపాటు పీచు ఎక్కువగా ఉంటుంది.

అనేక చర్మవ్యాధులను నివారిస్తుంది. ఎముకల పటిష్టతకు దోహదం చేస్తుంది. దృష్టి లోపాలను దూరం చేస్తుంది. అధిక పీచు, యాంటీఆక్సిడెంట్ల కారణంగా చామగడ్డ పలు క్యేన్సర్‌ల నుంచి కాపాడడమే కాకుండా క్యేన్సర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచి ఆహారం. చామగడ్డ వేరులలో డయోస్జెనిన్ పుష్కలంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు మరియు కీళ్లనొప్పుల వల్ల వచ్చే నొప్పికి చికిత్సగా ఉపకరిస్తుంది. దుంపలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపకరిస్తాయి.చామగడ్డ మూలాలలోని డయోస్జెనిన్ కొత్త చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి పోరాడుతున్న డయాబెటిక్ రోగులకు సరైన ఆహారంగా చెప్పవచ్చు. హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. హార్మోన్ల సమస్యలతో పోరాడుతున్నట్లయితే దీనిని రోజువారి ఆహారంలో కొద్ది మొత్తంలో తీసుకోవటం మంచిది. క్యాన్సర్ కారకాలతో పోరాడగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పెద్దప్రేగు మరియు రొమ్ము క్యాన్సర్ పురోగతిని నెమ్మదిస్తుందని ప్రాథమిక అధ్యయనాలు సూచిస్తున్నాయి.