Corona : ఆర్మీ బెటాలియన్‌లో జవాన్లకు కరోనా

ఉత్తరాఖండ్‌లోని ఆర్మీ బెటాలియన్‌లో కరోనా కలకలం రేపింది. డెహ్రాడూన్‌ జిల్లా చక్రతాలోని బెటాలియన్‌కు చెందిన అనేక మంది జవాన్లకు కరోనా సోకినట్లు గుర్తించి, క్వారంటైన్‌కు తరలించారు.

Corona : ఆర్మీ బెటాలియన్‌లో జవాన్లకు కరోనా

Army

Corona positive for soldiers : ఉత్తరాఖండ్‌లోని ఆర్మీ బెటాలియన్‌లో కరోనా కలకలం రేపింది. డెహ్రాడూన్‌ జిల్లా చక్రతాలోని బెటాలియన్‌కు చెందిన అనేక మంది జవాన్లకు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించి, వారిని క్వారంటైన్‌కు తరలించారు. అయితే, జవాన్లకు వైరస్‌ ఎలా సోకిందనే విషయంపై ఆరోగ్యశాఖ సమాచారం సేకరిస్తోంది.

ఇప్పటికే ముగ్గురు జవాన్లు మిలటరీ హాస్పిటల్‌లో చేరారు. జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ రాజీవ్ దీక్షిత్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇప్పుడు డూన్ మెడికల్ కాలేజీలో జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ డూన్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశుతోష్ సయానా మాట్లాడుతూ కళాశాలలో ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Aircraft : అంటార్కిటికా గడ్డపై కొత్త చరిత్ర..తొలిసారిగా మంచుపై ల్యాండ్ అయిన విమానం

నమూనాలను పరీక్షల కోసం అన్ని కేంద్రాలకు పంపాలని కోరారు. మరోవైపు ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో సోకిన 8 మంది ఐఎఫ్‌ఎస్ అధికారుల నమూనాలను ఢిల్లీలో తీసుకున్నట్లు జిల్లా నిఘా అధికారి డాక్టర్ రాజీవ్ దీక్షిత్ తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను పంపారు.