కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత ఏక్నాథ్ గైక్వాడ్ మృతి

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్ బుధవారం ఉదయం మరణించారు. కొద్దిరోజుల కిందట కరోనా వైరస్ బారిన పడిన ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ

కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత ఏక్నాథ్ గైక్వాడ్ మృతి

Ex Congress Mp Eknath Gaikwad

Ex congress mp eknath gaikwad : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్ బుధవారం ఉదయం మరణించారు. కొద్దిరోజుల కిందట కరోనా వైరస్ బారిన పడిన ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 10 గంటలకు తుది శ్వాస విడిచారు. ఏక్నాథ్ గైక్వాడ్ కుమార్తె వర్షా గైక్వాడ్ ప్రస్తుతం మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.. ముంబై పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఏక్నాథ్.. అక్కడి రాజకీయాల్లో చక్రం తిప్పారు.. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన, బీజేపీ వంటి పార్టీలను తట్టుకొని నిలబడింది అంటే.. ఏక్నాథ్ గైక్వాడ్ రాజకీయ చతురత కూడా ఒక కారణం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు..

గైక్వాడ్ సామాజిక వర్గం ఓటర్లు మహారాష్ట్ర ముఖ్యంగా ముంబైలో ఉండటం కారణంగా కాంగ్రెస్ పార్టీ ఏక్నాథ్ గైక్వాడ్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. గతేడాది ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో ఏక్నాథ్ కుమార్తెకు మంత్రి పదవి లభించడం.. పైగా కీలకమైన విద్యాశాఖను ఆమెకు కట్టబెట్టడం వెనుక కారణం కూడా సామాజికవర్గ వ్యూహంలో భాగమే అంటారు. ఆయన మరణం రాష్ట్ర కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఏక్నాథ్ గైక్వాడ్ పలువురు నేతలు సంతాపం తెలిపారు.