India Coronavirus Updates: భారత్‌లో తగ్గుతోన్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 70,421 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

India Coronavirus Updates: భారత్‌లో తగ్గుతోన్న కరోనా కేసులు

India Coronavirus Updates

India Coronavirus Updates: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 70,421 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 3,921 మంది కొవిడ్‌తో మృతి చెందారు. దీంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,74,305కి చేరింది. అలాగే 1,19,501 మంది క‌రోనా నుంచి కొలుకుని ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశంలో 2,81,62,947 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 9,73,158 కొవిడ్ పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.

గత 24 గంటల్లో 14,92,152 మందికి కరోనా పరీక్షలు చేశారు. దేశంలో మొత్తంగా కొవిడ్ టెస్టుల సంఖ్య 37,96,24,626కు చేరింది. ఇప్పటి వరకు 25.48 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ రోజువారీ కొవిడ్ పరీక్ష పాజిటివిటీ రేటు 100 నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూనే ఉంది. వరుసగా ఏడవ రోజు, 5 శాతం మార్క్ కంటే 4.71 వద్ద నిలిచింది. ఏప్రిల్ 1 నుంచి భారత్ లో తక్కువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా దాదాపు 4వేలకు చేరాయి.

ఢిల్లీలో కరోనావైరస్ సంఖ్య మూడు నెలల కనిష్టానికి పడిపోయింది. ఢిల్లీ ప్రభుత్వం దశలవారీ అన్‌లాక్ చేస్తోంది. అన్ని మార్కెట్లు తిరిగి తెరుచుకునేందుకు ఈ రోజు నుంచి అనుతినించారు. వారపు మార్కెట్లు కూడా అనుమతి లభించింది. 50 శాతం అమ్మకందారులతో, ప్రతి మునిసిపల్ జోన్‌లో రోజుకు ఒక మార్కెట్ మాత్రమే పనిచేస్తుంది. సెలూన్లు తెరుచుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి సామర్థ్యంతో 50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ కార్యాలయాలు పనిచేసుకోవచ్చు. 50 శాతం సామర్థ్యంతో ఢిల్లీ మెట్రో, బస్సులు నడుస్తాయి. కానీ, పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు పనిచేయవు.