National
Coronavirus : 30 రోజులు..79 వేల మంది చిన్నారులకు కరోనా
సెకండ్ వేవ్ లో మాత్రం చిన్నారులపై పంజా విసురుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే…దేశ వ్యాప్తంగా 79 వేల 688 మంది చిన్నారులకు వైరస్ సోకడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సెకండ్ వేవ్ లో మాత్రం చిన్నారులపై పంజా విసురుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే…దేశ వ్యాప్తంగా 79 వేల 688 మంది చిన్నారులకు వైరస్ సోకడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Publish Date - 11:46 am, Thu, 8 April 21
covid surge : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. దీంతో అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే..గత సంవత్సరం వచ్చిన ఈ కరోనా వైరస్ పెద్దలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ లో మాత్రం చిన్నారులపై పంజా విసురుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే…దేశ వ్యాప్తంగా 79 వేల 688 మంది చిన్నారులకు వైరస్ సోకడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మార్చి 01 నుంచి ఏప్రిల్ 04వ తేదీ మధ్యలో ఒక్క మహారాష్ట్రలో 60 వేల 684 మంది చిన్నారులకు కరోనా సోకింది. ఇందులో ఐదేళ్ల లోపు చిన్నారులు 9 వేల 882 మంది ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఛత్తీస్ గడ్ లో 5 వేల 940 మంది పిల్లలు కరోనా బారిన పడగా..922 మంది చిన్నారులు ఐదేళ్ల లోపు వారు ఉన్నారు. కర్నాటకలో 7 వేల 327 మంది, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 3 వేల 004 మంది ఐదేళ్ల లోపు చిన్నారులున్నారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే..ఇలాంటి పరిస్థితే నెలకొందని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఢిల్లీలో 2 వేల 733 మంది పిల్లలు కరోనా రాగా…ఐదేళ్ల లోపు చిన్నారులు 441 మంది ఉన్నారు. కరోనా సోకిన చిన్నారుల్లో అత్యధికంగా పేదరికం నుంచి వచ్చిన వారే ఉన్నారు. చిన్న పిల్లలకు ఆస్ట్రాజెనీకా టీకా అందుబాటులోకి వచ్చినా..దానివల్ల పిల్లల్లో బ్లడ్ క్లాటింగ్ అవుతుండడంతో ఆ టీకాను నిలిపివేశారు.
Read More : మహారాష్ట్రలో వ్యాక్సిన్ల కొరత..అదేం లేదంటున్న కేంద్రం
COVID-19 New Symptoms : టెస్టుల్లో అంతుచిక్కని వైరస్.. కరోనా కొత్త లక్షణాలు ఇవే!
Mask : క్లాత్ మాస్కులు కరోనాను అడ్డుకోలేవా? ప్రమాదం తప్పదా?
Jagan Meeting: టెన్త్ పరీక్షలు రద్దు చేస్తారా? వాయిదా వేస్తారా?
COVID second wave: కరోనా కేసుల పెరుగుదలకు రెండు కారణాలు ఇవే!
No Mask: Railways Fine రైల్వే శాఖ కీలక నిర్ణయం..మాస్క్ లేకుంటే రూ.500 జరిమానా
Sonu Sood : సోనూ సూద్‌కు కరోనా.. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత సోకిన మహమ్మారి..