కరోనా సోకి 162డాక్టర్లు..107నర్సులు..44 ఆశా వర్కర్లు మృతి

కరోనా సోకి 162డాక్టర్లు..107నర్సులు..44 ఆశా వర్కర్లు మృతి

Covid-19 దేశంలో కరోనా వైరస్ సోకడం వల్ల 162మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. దేశంలో ఎంతమంది డాక్టర్లు,నర్సులు,ఆశా వర్కర్లు కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యి ప్రాణాలు కోల్పోయారు అని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన సమాధానంలో..జనవరి-22,2021నాటికి దేశవ్యాప్తంగా 162మంది డాక్టర్లు,107మంది నర్సులు,44మంది ఆశావర్కర్లు కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ స్టాఫ్ అందరికీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన(PMGKP: Insurance Scheme)కింద ఇన్యూరెన్స్ పంపిణీ ప్రక్రియ జరుగుతందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే పేర్కొన్నారు.

మరోవైపు, మ‌రో వైపు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు మంగళవారం భారీగా తగ్గాయి. గతేడాది జూన్‌ 7వ తేదీ తర్వాత తక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,635 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,07,66,245కు పెరిగింది. ఇప్పటి వరకు 1,04,48,406 మంది కోలుకున్నారని, మృతుల సంఖ్య 1,54,486కు పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో 1,63,353 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని చెప్పింది. సోమవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 6,59,422 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 19,77,52,057 నమూనాలను పరిశీలించినట్లు చెప్పింది. ఇక, దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 39,50,156 మందికి టీకాలు వేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.