COVID-19 Vaccination Drive : వ్యాక్సిన్ డబ్బాలతో నదిని దాటిన హెల్త్ వర్కర్లు

వ్యాక్సిన్ లున్న ఉన్న కోల్డ్ స్టోరేజీ బాక్స్ లను భుజాలకు వేసుకుని..మోకాలి లోతు నీటిలో ఒకరి చేతులు మరొకరు పట్టుకుని సాయం చేసుకంటూ...నదిని దాటారు. వంద శాతం వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని, 45 ఏళ్లు పైబడిన వయస్సు వారికంతా టీకాలు ఇవ్వాల్సి ఉందని రాజౌరి జిల్లా వైద్య అధికారి ఇక్బాల్ మాలిక్ వెల్లడించారు.

COVID-19 Vaccination Drive : వ్యాక్సిన్ డబ్బాలతో నదిని దాటిన హెల్త్ వర్కర్లు

Health Workers

Health Workers Across A River : కరోనా మహమ్మారి భారతదేశాన్ని వదలనంటోంది. గతంలో కన్నా..ఇప్పుడు తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం కొంత ఊరటనిచ్చే విషయమే. వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నారు. వారికి ఇవ్వడానికి సిబ్బంది పలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. జమ్మూ కాశ్మీర్ లోనలి మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు హెల్త్ కేర్ బృందం పెద్ద సాహసమే చేసిందని చెప్పవచ్చు. కోల్డ్ బాక్స్ లను భుజాలకు వేసుకుని నదిని దాటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రాజౌరి జిల్లా గ్రామాలకు వెళ్లడానికి నదిని దాటాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా లేదు. దారంతా గతుకులమయం. ఈ గ్రామాలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు హెల్త్ కేర్ బృందం పయనమైంది. గతుకుల రోడ్డుపై నడిచే బదులు..నదిని దాటడమే బెటర్ అని అనుకున్నారు.

వ్యాక్సిన్ లున్న ఉన్న కోల్డ్ స్టోరేజీ బాక్స్ లను భుజాలకు వేసుకుని..మోకాలి లోతు నీటిలో ఒకరి చేతులు మరొకరు పట్టుకుని సాయం చేసుకంటూ…నదిని దాటారు. వంద శాతం వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని, 45 ఏళ్లు పైబడిన వయస్సు వారికంతా టీకాలు ఇవ్వాల్సి ఉందని రాజౌరి జిల్లా వైద్య అధికారి ఇక్బాల్ మాలిక్ వెల్లడించారు. వృత్తి, విధి నిర్వాహణ పట్ల వాని అంకిత భావానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వారిని ప్రశంసిస్తున్నారు.

Read More : హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్: నగరంలో తగ్గిన కరోనా కేసులు