Covid Vaccine Certificate : కేంద్రం కీలక నిర్ణయం..వారికి కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు |Covid Vaccine Certificate Now Available For Covishield, Covaxin Trial Participants On Co-WIN

Covid Vaccine Certificate : కేంద్రం కీలక నిర్ణయం..వారికి కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు

 కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డిజిటల్‌ సర్టిఫికెట్ల జారీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Covid Vaccine Certificate : కేంద్రం కీలక నిర్ణయం..వారికి కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు

Covid Vaccine Certificate కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డిజిటల్‌ సర్టిఫికెట్ల జారీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ల(కోవిషీల్డ్,కోవాగ్జిన్) క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న 11,349 మందికి కొ-విన్‌ పోర్టల్‌ నుంచి వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు పొందవచ్చని కేంద్రం తెలిపింది.

వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నవారికి డిజిటల్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలంటూ విజ్ఞప్తులు రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు 11,349మంది డేటాను ఐసీఎంఆర్‌ అందజేసిందని తెలిపింది.

ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు. కొవిడ్‌ వ్యాక్సిన్ల పరిశోధన, చికిత్సలో వారి నిబద్ధత, అద్భుతమైన సహకారానికి దేశం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. కొ-విన్‌ పోర్టల్‌తో పాటు ఆరోగ్య సేతు, డిజిలాకర్‌, ఉమాంగ్‌ యాప్‌ల ద్వారా కూడా సర్టిఫికెట్లను పొందవచ్చని ట్వీట్ లో తెలిపారు.

×