చనిపోయాడనుకుని అంత్యక్రియలు పూర్తి చేస్తే తిరిగొచ్చాడు

చనిపోయాడనుకుని అంత్యక్రియలు పూర్తి చేస్తే తిరిగొచ్చాడు

హాస్పిటల్‌లో చేసిన తప్పు బతికుండగానే ఆ కుటుంబంలోని వ్యక్తిని చంపేసింది. 75ఏళ్ల వ్యక్తికి కొవిడ్-19 వచ్చిందని గత వారం ఆ కుటుంబం హాస్పిటల్ లో చేర్పించారు. శివదాస్ బెనర్జీ అనే వ్యక్తిని బల్‌రామ్‌పూర్ బసు హాస్పిటల్ లో నవంబర్ 4న అడ్మిట్ చేశారు. నవంబర్ 13న చనిపోయినట్లు డిక్లేర్ చేసి బెనర్జీ కుటుంబానికి అప్పగించారు.

ఆ తర్వాత బెనర్జీ కుటుంబం అతని శరీరాన్ని దూరం నుంచి చూసే అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ.. ప్రొటెక్టివ్ లేయర్లతో చుట్టి ఉంచారు ఆ మృతదేహాన్ని. దాంతో వారు దహనం చేస్తున్న డెడ్ బాడీ తమ వారిది కాదని తెలుసుకోలేకపోయారు.



శుక్రవారం బెనర్జీ రికవరీ అవడంతో హాస్పిటల్ స్టాఫ్ కుటుంబ సభ్యులను పిలిపించారు. డిశ్చార్జ్ కు రెడీ అవుతుండగా నిజం తెలిసింది. అది అతనికి సంబంధించిన కుటుంబం కాదని, ముఖర్జీ కుటుంబాన్ని చూశాక అర్థమైంది. ఖర్దా హాస్పిటల్ చేసిన తప్పును తెలుసుకుని లబోదిబోమన్నారు.

నవంబర్ 13న శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహిస్తుండగా బెనర్జీ ప్రాణాలతో ఇంటికి చేరుకునేసరికి అంతా షాక్ అయ్యారు. అప్పుడే తెలిసింది వాళ్లు అంత్యక్రియలు పూర్తి చేసింది 75ఏళ్ల మోహినీ మోహన్ ముఖర్జీ శవానికి అని.

తప్పు ఎక్కడో జరిగిందో విచారిస్తున్నట్లు హాస్పిటల్ చెప్పింది. దీనికి గానూ.. నలుగురు సభ్యుల కమిటీ వేసి ఎంక్వైరీ చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. జిల్లా మెడికల్ ఆఫీసర్ టపాస్ రాయ్ దీనికి సంబంధించిన రిపోర్టును స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెంట్ కు పంపించనున్నట్లు చెప్పారు.