Omicron: మోదీజీ.. ఆ దేశాల నుంచి విమానాలు ఆపి కరోనాను అడ్డుకోండి – కేజ్రీవాల్

దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం కరోనా బీభత్సం సృష్టిస్తుంది. వేలల్లో పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనలో మునిగిపోతున్నారు. గతంలోని వేరియంట్ల మాదిరి కాకుండా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’

Omicron: మోదీజీ.. ఆ దేశాల నుంచి విమానాలు ఆపి కరోనాను అడ్డుకోండి – కేజ్రీవాల్

Arvind Kezriwal

Omicron: దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం కరోనా బీభత్సం సృష్టిస్తుంది. వేలల్లో పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనలో మునిగిపోతున్నారు. గతంలోని వేరియంట్ల మాదిరి కాకుండా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ దఢ పుట్టిస్తుంది. ఈ వేరియంట్‌ భారత్‌లోకి రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కేంద్రాన్ని కోరారు.

ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల నుంచి తక్షణమే విమాన రాకపోకలను నిలిపివేయాలంటూ ట్విటర్‌ వేదికగా పీఎంను అభ్యర్థించారు. ‘ఎన్నో వ్యయప్రయాసలను ఓర్చి ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నాం. కొత్త వేరియంట్‌ దేశంలోకి ప్రవేశించకుండా సాధ్యమైనన్ని చర్యలు చేపట్టాలి. కేసులు వెలుగుచూసిన దేశాల నుంచి భారత్‌కు విమానాల రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని కోరుతున్నా’’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ శనివారం అధికారులతో కీలక భేటీ జరపనున్నారు.

……………………………….. : తిరుమలలో సందడి చేస్తున్నకొత్తజంట

కొవిడ్‌ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమయంలో.. ఈ వేరియంట్‌ మరో ఉధృతికి దారితీయొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దక్షిణాఫ్రికా సహా ఇజ్రాయెల్‌, బోట్స్‌వానా, హాంకాంగ్‌ల్లో ఈ రకం కేసులు వెలుగుచూశాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ మళ్లీ ప్రయాణ ఆంక్షలను మొదలుపెట్టాయి.