Delhi Mundka Fire : ఢిల్లీ అగ్నిప్రమాదం.. ఇంకా 29మంది మిస్సింగ్.. మెజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశం
దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని సీఎం కేజ్రీవాల్ పరిశీలించారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. కారకులను విడిచిపెట్టేది లేదన్నారు.

Delhi Mundka Fire : భారీ అగ్నిప్రమాదంలో దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. ముండ్కా ప్రాంతంలోని ఓ కమర్షియల్ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 29 మరణించారు. మరో 29 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
కాగా, దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరిశీలించారు. దీనిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు సీఎం కేజ్రీవాల్. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు కేజ్రీవాల్. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, గాయపడిన వారి కుటుంబాలకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం కేజ్రీవాల్.

Delhi Fire
Fire Broke Out : అమృత్ సర్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో గురునానక్ దేవ్ ఆస్పత్రి
ఇప్పటివరకు లభించిన మృతదేహాల్లో 25 మంది మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ 25 డెడ్‌బాడీల గుర్తింపునకు డీఎన్ఏ శాంపిళ్లను ఫోరెన్సిక్ అధికారులు సేకరించారని వెల్లడించారు. డీఎన్ఏ టెస్టుల అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.

Delhi Mundka Fire, 29 Missing As Delhi Fire Kills 27, Arvind Kejriwal Orders For Magisterial enquiry
ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం ఘోర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముండ్కా ఏరియాలోని ఓ నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది మహిళలతో పాటు ఐదుగురు పురుషుల ఆచూకీ లభించలేదు. ఆచూకీ లభించని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Delhi Mundka fire: ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఇద్దరిపై కేసు నమోదు
ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగా మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఇటీవలి కాలంలో ఢిల్లీలో జరిగిన అత్యంత దారుణమైన అగ్ని ప్రమాదం ఇదే అని అధికారులు చెబుతున్నారు.

Delhi Mundka Fire, 29 Missing As Delhi Fire Kills 27, Arvind Kejriwal Orders For Magisterial enquiry
భవనంలో మంటలు, పొగ అలుముకుంటుండగా.. అందులో ఉన్న వారు తాళ్ల సాయంతో, కిటికీల నుంచి బయటపడానికి ప్రయత్నించారు. కొందరు మంటలు అంటుకున్న భవనం నుంచి మరో భవనంలోకి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.
శుక్రవారం సాయంత్రం 4 గంటల 40 నిమిషాల సమయంలో మంటలు అంటుకోగా.. అగ్నిమాపక సిబ్బంది 30 ఫైరింజన్ల సాయంతో అర్ధరాత్రి వరకూ మంటలను ఆర్పేందుకు శ్రమించాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి భవనం లోపలికి వెళ్లే సరికే వారికి కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి.

Delhi Mundka Fire, 29 Missing As Delhi Fire Kills 27, Arvind Kejriwal Orders For Magisterial enquiry
మంటల్లో చిక్కుకున్న వారు ప్రాణభయంతో చివరిసారిగా తమ కుటుంబీకులకు ఫోన్లు చేశారు. 4.45 గంటల సమయంలో స్థానికులకు పొగ కనిపించింది. ఆ తర్వాత మంటలు కనిపించాయి. కాసేపట్లోనే ఆ భవనం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఈ భవనంలో సీసీటీవీలు, వైఫై రౌటర్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేస్తారని పోలీసులు తెలిపారు. జనరేటర్ ఉంచిన మొదటి అంతస్తులో మంటలు మొదలై ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత రెండు, మూడో అంతస్తుకు వ్యాపించి ఉంటాయన్నారు. దీంతో ఆ ఫ్లోర్లలో పని చేస్తున్న వారు మంటల్లో చిక్కుకుపోయారు.
मुंडका स्थित इमारत में लगी आग का हादसा बेहद दर्दनाक और झकझोर देने वाला है। माननीय मुख्यमंत्री जी ने खुद मौक़े पर पहुँचकर अधिकारियों से रिपोर्ट ली।
हादसे की मजिस्ट्रेट जाँच के आदेश दे दिए गए हैं। मृतकों के परिवार को 10 लाख रुपए एवं घायलों को 50 हज़ार का मुआवज़ा दिया जाएगा। pic.twitter.com/tYIMas91sJ
— CMO Delhi (@CMODelhi) May 14, 2022
1Navjot Singh Sidhu: జైలులో క్లర్కుగా మారిన సిద్ధూ.. మూడు నెలల తర్వాతే జీతం
2Terror Funding Case : యాసిన్ మాలిక్‌కి జీవిత ఖైదు విధించిన ఎన్ఐఏ కోర్ట్
3Yasin Malik: టెర్రర్ ఫండింగ్ కేసులో యాసిన్ మాలిక్ అరెస్ట్
4Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
5Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్
6Kerala Actress: నటితో పోలీసు అసభ్య ప్రవర్తన.. దర్యాప్తు
7Vijayawada : ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి వేడుకలు
8Vikram: విక్రమ్ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?
9Japanese Man: కుక్కగా మారిపోయేందుకు రూ.12లక్షలు ఖర్చు పెట్టిన జపాన్ వ్యక్తి
10Naga Chaitanya: థ్యాంక్ యూ టీజర్ టాక్.. తనను తాను సరిచేసుకునే ప్రయాణం!
-
PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్ చెక్కపెట్టె’ గురించి తెలుసా
-
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం తన తోబుట్టువులకు, బంధువులకు నెల నెలా రూ.10 లక్షలు పంపాడు: ఈడీ
-
Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో బొమ్మరిల్లు కడతానంటోన్న చైతూ!
-
Heart : వీటితో గుండెకు నష్టమే?
-
Lungs : ఊపిరితిత్తుల్లో నీరు ప్రాణాంతకమా?
-
Nani: నేచురల్ స్టార్‌ను ఊరమాస్‌గా మార్చనున్న డైరెక్టర్..?
-
Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
-
Mega154: మలేషియా చెక్కేస్తున్న వాల్తేర్ వీరయ్య..?