ఢిల్లీలో ఎదురు కాల్పులు….నలుగురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కు గాయాలు

  • Published By: murthy ,Published On : October 8, 2020 / 02:15 PM IST
ఢిల్లీలో ఎదురు కాల్పులు….నలుగురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కు గాయాలు

Delhi Most Wanted Criminals Encounter : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తెల్లవారు ఝూమున ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో పేరు మోసిన నేరస్ధులు నలుగురికి గాయాలయ్యాయి. ఇరువైపులా 50 రౌండ్లు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

బేగంపూర్ పోలీసు స్టేషన్ పరిధి, డీప్ విహార్ లోని హనుమాన్ చౌక్ సమీపంలో, సౌత్ వెస్ట్ రేంజ్ స్పెషల్ పార్టీ పోలీసులకు….నేరస్ధులకు మధ్య గురువారం తెల్లవారు ఝూమున ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మోస్ట్ వాంటెడ్ నేరస్ధులు గాయపడ్డారు. గాయపడిన వారిని లారెన్స్ బిష్ణోయి కాలా జతేడి గ్యాంగ్ కు చెందిన….రోహిత్, అమిత్, రవీందర్ యాదవ్, సునీల్ గా గుర్తించారు.



గాయపడిన వీరిని చికిత్స కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రికి తరలించారు. నిందితుల వద్ద నుంచి నాలుగు ఆటోమేటిక్ పిస్టల్స్ …70 లైవ్ కార్ట్రిడ్జ్ లు ….10 లైవ్ కార్ట్రిడ్జ్ లు… రెండు దేశీయంగా తయారు చేసిన పిస్టల్స్ …మూడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు… హెల్మెట్లు ఒక్కోక్కటి….నిందితులు ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నారు.

పలు నేరాలతో సంబంధం ఉండి,  పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్  కదలికలను పోలీసులు గమనిస్తున్నారు.పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు….. ఒక వ్యక్తిని హత్య చేయటానికి లారెన్స్ బిష్ణోయి కాలా జతేడి గావ్ గ్యాంగ్ కు చెందిన ముఠా ప్రయత్నిస్తోందని తెలుసుకున్నారు. వీరిని పట్టుకునేందుకు స్పెషల్ సెల్ పోలీసులు గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారు.



పోలీసులకు బుధవారం అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు, వీరిని సెక్టార్ 26 రోహిణీలో పట్టుకునేందుకు ప్లాన్ చేశారు. గురువారం తెల్లవారు ఝామున గం.3-30 సమయంలో నేరస్ధులు ఆ ప్రాంతానికి చేరుకోగానే వారిని లొంగి పొమ్మని పోలీసులు కోరారు.

పోలీసులకు దొరక్కుండా తప్పించుకునేందుకు…. నేరస్ధులు పోలీసులపై 22 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసులు, నేరస్ధులపై 28 రౌండ్లు కాల్పులు జరిపారు.



ఇరువైపులా 50 రౌండ్లు కాల్పులు జరిగాయి. పోలీసు కాల్పులకు గాయాల పాలైన నేరస్ధులు కింద పడిపోవటంతో వారిని పట్టుకుని ఆస్పత్రికి తరలించారు. హత్యాయత్నం, హత్య, దోపిడీ, కాల్పులు వంటి 12 కు పైగా కేసుల్లో వీరు నిందితులని పోలీసులు తెలిపారు.