Covid Vaccine:సెంటర్లు క్లోజ్.. ఇప్పట్లో వ్యాక్సిన్లు లేవ్

ప్రభుత్వం నిర్వహిస్తున్న వ్యాక్సిన్ సెంటర్లు చాలా వరకూ క్లోజ్ అవనున్నాయి. మంగళవారానికి సరిపడా కొవీషీల్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్ల స్టాక్ అయిపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సోమవారం అన్నారు.

Covid Vaccine:సెంటర్లు క్లోజ్.. ఇప్పట్లో వ్యాక్సిన్లు లేవ్

Covid Vaccine

Covid Vaccine: ప్రభుత్వం నిర్వహిస్తున్న వ్యాక్సిన్ సెంటర్లు చాలా వరకూ క్లోజ్ అవనున్నాయి. మంగళవారానికి సరిపడా కొవీషీల్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్ల స్టాక్ అయిపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సోమవారం అన్నారు. రాత్రి 10 గంటల సమయానికి 36వేల 310 వ్యాక్సిన్ల డోసులు మాత్రమే ఇచ్చామని రోజుకు 1.5లక్షల డోసులకు చేరుకోలేకపోయామని అన్నారు.

‘ఢిల్లీలో మళ్లీ వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఒకట్రెండు రోజులకు సరిపడ వ్యాక్సిన్లు మాత్రమే పంపింది. అంటే చాలా రోజులు వ్యాక్సిన్ సెంటర్లు మూసే ఉంచాలి. ఇన్ని రోజులుగా వ్యాక్సిన్ ప్రోగ్రాం ఎందుకు ఇంత నిదానంగా జరుగుతుంది’ అంటూ సిసోడియా ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

ఢిల్లీ రిపీటెడ్ గా వ్యాక్సిన్ల కొరతను ప్రస్తావిస్తూనే ఉంది. పలు నగరాల్లో.. వ్యాక్సిన్లు లేక సెంటర్లు మూతపడే ఉన్నాయని వాపోతుంది. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే వ్యాక్సిన్ పంపుతుండగా మహారాష్ట్రాలోనూ వ్యాక్సిన్ కొరత కనిపిస్తూనే ఉంది.

CoWIN ప్లాట్‌ఫాంలో వారానికి సగటున 61.14లక్షల కొవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నారని.. జూన్ 28-జులై 4వరకూ 41.92లక్షల వ్యాక్సిన్లు మాత్రమే వేశారని రికార్డులు చెబుతున్నాయి. హెల్త్ మినిస్ట్రీ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఇంకా 1.54కోట్ల వ్యాక్సిన్ డోసులు బ్యాలెన్స్ ఉందని చెబుతుంది. డిసెంబర్ చివరి నాటికి జనాభా మొత్తానికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనేది కేంద్రం ప్లాన్.