Delimitation for Women Reservation: 2029 కాదు 2031 లేదంటే 2039లో మహిళా రిజర్వేషన్లు అమలయ్యే ఛాన్స్.. పెద్ద అడ్డంకిగా మారిన డీలిమిటేషన్ గురించి పూర్తిగా తెలుసుకోండి

జనాభా నియంత్రణను మెరుగైన మార్గంలో అమలు చేసే రాష్ట్రాల్లో లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గుతుందని చాలా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ భయాందోళనలను పరిష్కరించడానికి, 1976లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పాలనలో 2001 వరకు డీలిమిటేషన్‌ను నిలిపివేసేందుకు రాజ్యాంగానికి 42వ సవరణ చేశారు.

Delimitation for Women Reservation: 2029 కాదు 2031 లేదంటే 2039లో మహిళా రిజర్వేషన్లు అమలయ్యే ఛాన్స్.. పెద్ద అడ్డంకిగా మారిన డీలిమిటేషన్ గురించి పూర్తిగా తెలుసుకోండి

Delimitation for Women Reservation: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. తొంరలోనే రాజ్యసభ ఆమోదం కూడా పొందే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారుతుంది. అయితే ఇది అమలు కావాలంటే ముందుగా రెండు ప్రధాన షరతుల్ని దాటాల్సి ఉంటుంది. అవి జనాభా గణన ఒకటి కాగా, డీలిమిటేషన్ పూర్తి కావడం రెండవది. అయితే ఈ రెండు పూర్తవ్వాలంటే చాలా సంవత్సరాలు పట్టవచ్చు. అసలు ఈ ప్రాసెస్ అంతా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. నారీ శక్తి వందన్ బిల్లు(మహిళా రిజర్వేషన్ బిల్లు) చట్టంగా మారితే వచ్చే జనాభా లెక్కల తర్వాత అమలులోకి వస్తుంది. చట్టం రూపొందించిన తర్వాత జరిగే జనాభా గణన తర్వాత, రిజర్వేషన్లను అమలు చేయడానికి డీలిమిటేషన్ ఉంటుంది. డీలిమిటేషన్‌ ఆధారంగా మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించనున్నారు.

డీలిమిటేషన్ అంటే ఏమిటి?
నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించే ప్రక్రియను డీలిమిటేషన్ అంటారు. అంటే, దీని ద్వారానే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను కొత్తగా ఖరారు చేస్తారు. ఆర్టికల్ 81, 170, 330, 332 ప్రకారం.. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో సీట్ల కూర్పు, రిజర్వేషన్‌లకు సంబంధించిన కసరత్తు జరుగుతంది. ప్రతి జనాభా గణన తర్వాత ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయవచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 చెబుతోంది. దీని కింద వివిధ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలను జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తారు. జనాభా ప్రకారం షెడ్యూల్డ్ కులాలు-తెగ సీట్ల సంఖ్య మారవచ్చు.

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ 2029లోనే ఎందుకు అమలు చేస్తారో రాజ్యసభలోనే సమాధానం ఇచ్చిన జేపీ నడ్డా

1951 నుంచి 1971 వరకు ప్రతి జనాభా గణన తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన జరిగింది. 1971లో నిర్వహించిన జనాభా లెక్కల తర్వాత 1972లో లోక్‌సభ స్థానాలకు డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత లోక్‌సభ స్థానాల సంఖ్య 522 నుంచి 543కి పెరిగింది. దీని తర్వాత, 2001 జనాభా లెక్కల తర్వాత రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు తాజా డీలిమిటేషన్ జరిగింది. అదే సమయంలో లోక్‌సభ స్థానాల సంఖ్య 543 అలాగే ఉంది. అయితే మారిన అసెంబ్లీ డీలిమిటేషన్ కారణంగా లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దుల్లో గణనీయమైన మార్పులు జరిగాయి. లోక్ సభ సీట్ల సంఖ్య పెరగకపోవడానికి కారణం మరో రాజ్యాంగంలోని పరిమితి కారణం. దీనికి రాజ్యాం సవరణ చేయాల్సి ఉంటుంది.

డీలిమిటేషన్ కసరత్తు ఎప్పుడు జరిగింది?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, దేశంలో ఏడు సార్లు జనాభా గణన నిర్వహించారు. అయితే డీలిమిటేషన్ నాలుగు సార్లు మాత్రమే జరిగింది. డీలిమిటేషన్ కమిషన్ భారతదేశంలో మొదటిసారిగా 1952లో ఏర్పడింది. దీని తర్వాత 1963, 1973, 2002లో డీలిమిటేషన్ కమిషన్‌లు ఏర్పాటయ్యాయి. డిలిమిటేషన్ కమిషన్ 12 జూలై 2002న రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుల్దీప్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైంది. కమిషన్ 2001 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను విభజించింది. 2002లో చివరిసారిగా నియోజకవర్గాల సరిహద్దులను గీయడానికి మాత్రమే డీలిమిటేషన్ కసరత్తు చేయడం గమనార్హం. దీంతో నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు. అంటే 1971లో దశాబ్ధాల జనాభా లెక్కల ఆధారంగా 1976లో లోక్‌సభ స్థానాలను పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య మారలేదు.

1971 తర్వాత లోక్ సభ సీట్లు ఎందుకు పెరగలేదు?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 జనాభా ప్రకారం లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉండాలని చెబుతోంది. కానీ 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన జరిగిన డీలిమిటేషన్ ద్వారా ఎలాంటి మార్పు జరగలేదు. వాస్తవానికి ఆర్టికల్ 81 ప్రకారం జనాభా-సీటు నిష్పత్తి అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉండాలి. 1970లలో కేంద్రం జనాభా నియంత్రణ ప్రచారాలను ప్రారంభించింది. దీంతో జనాభా నియంత్రణను మెరుగైన మార్గంలో అమలు చేసే రాష్ట్రాల్లో లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గుతుందని చాలా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనికి విరుద్ధంగా, తమ జనాభాను నియంత్రించుకోలేని రాష్ట్రాలు పార్లమెంటులో ఎక్కువ సంఖ్యలో సీట్లు పొందవచ్చు. ఈ భయాందోళనలను పరిష్కరించడానికి, 1976లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పాలనలో 2001 వరకు డీలిమిటేషన్‌ను నిలిపివేసేందుకు రాజ్యాంగానికి 42వ సవరణ చేశారు.

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మార్చడంలో 27 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయి? పూర్తి చరిత్ర తెలుసుకోండి.

అయితే, ఆంక్షలు ఉన్నప్పటికీ, రాష్ట్రానికి కేటాయించిన పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్యను మార్చాలని కొన్ని సందర్భాల్లో డిమాండ్లు వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలకు 1986లో రాష్ట్ర హోదా లభించడం, ఢిల్లీకి శాసనసభ ఏర్పాటు, ఉత్తరాఖండ్ వంటి కొత్త రాష్ట్రాల ఏర్పాటు వంటివి జరిగాయి. 2001 జనాభా లెక్కల తర్వాత లోక్‌సభ, శాసన సభలలో సీట్ల సంఖ్యపై ఉన్న పరిమితిని తొలగించాల్సి ఉంది. కానీ రాజ్యాంగంలోని 84వ సవరణ ద్వారా ఈ పరిమితి 2026 వరకు వాయిదా పడింది. ఇది 2026 నాటికి దేశవ్యాప్తంగా ఒకే విధమైన జనాభా వృద్ధి రేటును సాధించాలనే సూత్రంపై ఆధారపడింది. రాజ్యాంగంలోని ప్రస్తుత నిబంధనల ప్రకారం, 2026 తర్వాత జరిగే జనాభా గణన తర్వాత డీలిమిటేషన్ తదుపరి కసరత్తు జరుగుతుంది. అంటే 84వ సవరణ తర్వాత 25 ఏళ్ల తర్వాత నిర్వహించిన మొదటి జనాభా గణన ఆధారంగా కొత్త డీలిమిటేషన్ ఉంటుంది. దీని అర్థం 2031 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది. అంతకుముందు, కరోనా మహమ్మారి కారణంగా 2021 జనాభా గణన నిర్వహించలేదు.

మరి మహిళా రిజర్వేషన్లు ఎప్పుడు అమలు చేస్తారు?
దీనికి సంబంధించి బుధవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణీత తేదీ లేదా సంవత్సరాన్ని ఇవ్వలేదు. 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్‌ జరుగుతుందని హోంమంత్రి అమిత్‌ షా చెప్పారు. రిజర్వ్డ్ సీట్లను డీలిమిటేషన్ కమిషన్ మాత్రమే నిర్ణయిస్తుంది. అదే సమయంలో గురువారం రాజ్యసభలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ 2029 నాటికి ఈ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. 2021 జనగణన ఇంకా జరగలేదు. ఇది ఎప్పుడు జరుగుతుందనే దానిపై ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2027 నాటికి ఈ జనాభా గణనను నిర్వహించి, డీలిమిటేషన్ కమిషన్ వచ్చే ఏడాదిన్నరలోగా తన నివేదికను సమర్పిస్తే, 2029 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ను మాత్రమే అమలు చేయవచ్చని అంటున్నారు.

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్లకే ఇన్నేళ్లు పడితే.. అధికారం రావడానికి ఎన్నేళ్లు పడుతుందో?

మనం చరిత్రను పరిశీలిస్తే, దీని గురించి కొంచెం ఆశ కనిపిస్తుంది. వాస్తవానికి, సాధారణంగా డీలిమిటేషన్ కమిషన్ కొత్త డీలిమిటేషన్ గణాంకాలను విడుదల చేయడానికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది. ఉదాహరణకు, 2001 జనాభా లెక్కల తర్వాత, జూలై 2002లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడింది. ఈ డీలిమిటేషన్ పని 31 మే 2008న పూర్తయింది. దీని తర్వాత కొత్త డీలిమిటేషన్ ఆధారంగా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పరిస్థితులు ప్రధానంగా తలెత్తుతాయి. మొదటిది 2021 జనాభా గణనను 2026కి ముందు నిర్వహించడం, రెండవది 2021 జనాభా గణనను 2026 తర్వాత నిర్వహించడం. 2026కి ముందు నిర్వహిస్తే.. డీలిమిటేషన్ కమిషన్ తన నివేదికను మూడు, నాలుగేళ్లలో సమర్పిస్తుంది. అనంతరం 2034 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్‌ను అమలు చేయవచ్చు. ఇక 2026 తర్వాత నిర్వహిస్తే.. 2031 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో, మహిళలకు ఈ రిజర్వేషన్ 2039 వరకు వేచి ఉండవలసి ఉంటుంది.