Sukesh Chandrasekhar : బీఆర్ఎస్‌ ఆఫీసులో రూ.75కోట్లు ఇచ్చా-సంచలనం రేపుతున్న సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ

15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించినట్టు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ప్కార్స్ చేసిన 6060 నెంబర్ గల రేంజ్ రోవర్ కారులో AP అనే షార్ట్ నేమ్ కల్గిన వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చానన్నాడు. సూచించినట్టు సుకేశ్ చంద్రశేఖర్ చెప్పాడు.

Sukesh Chandrasekhar : బీఆర్ఎస్‌ ఆఫీసులో రూ.75కోట్లు ఇచ్చా-సంచలనం రేపుతున్న సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Chandrasekhar

Sukesh Chandrasekhar : మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ రాసిన లేఖ సంచలనంగా మారింది. ఈ లేఖలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు సుఖేశ్. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లక్ష్యంగా సుఖేశ్ జైలు నుంచి ఈ లేఖ రాశాడు.

కేజ్రీవాల్ డ్రామాలు, అవినీతి, అబద్ధాలు బయటపెడతానంటూ లేఖలో పేర్కొన్నాడు. కేజ్రీవాల్‌తో ఉన్న 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్‌లో కొంత భాగం సుఖేశ్ బయటపెట్టాడు. కేజ్రీవాల్ తరపున హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) కార్యాలయంలో రూ.15 కోట్లు అందజేసిట్టు వెల్లడించాడు. డబ్బు అందుకున్న వ్యక్తి ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్నట్టు పేర్కొన్నాడు. బీఆర్ఎస్ కు విడతల వారిగా రూ.75కోట్లు ఇచ్చినట్లు తెలిపాడు.

Also Read..Wyra: 3 ఎన్నికలు.. 3 విలక్షణమైన తీర్పులు.. ఈసారి వైరాలో గెలిచేది ఏ పార్టీ అభ్యర్థి?

చాటింగ్‌లో కోడ్ పదాల ద్వారా నగదు లావాదేవీలు, రవాణ జరిగిందన్నాడు. 15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించినట్టు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ప్కార్స్ చేసిన 6060 నెంబర్ గల రేంజ్ రోవర్ కారులో AP అనే షార్ట్ నేమ్ కల్గిన వ్యక్తికి రూ.15 కోట్లు అందజేయాలని కేజ్రీవాల్ సూచించినట్టు సుకేశ్ చంద్రశేఖర్ చెప్పాడు.

Also Read..MLC Kavitha : ఇప్పుడు రాజకీయ పార్టీలను టార్గెట్ చేసిన బీజేపీ రేపు ప్రజల్ని కూడా టార్గెట్ చేస్తుంది : కవిత

అలా రూ.15 కోట్లు చొప్పున ఐదు విడతల్లో బీఆర్ఎస్ ఆఫీసులో రూ.75కోట్లు ఇచ్చానన్నాడు. 2020లో బీఆర్ఎస్ ఆఫీసుకొచ్చి డబ్బు ఇచ్చినట్లు వెల్లడించాడు. కేజ్రీవాల్ అవినీతి, అక్రమాల్లో ఇదొక టీజర్ మాత్రమే అన్నాడు. త్వరలో మరిన్ని అక్రమాలను బయటపెడతానంటూ లేఖలో పేర్కొన్నాడు. కాగా, ఈ లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ కలకలం రేపింది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రశేఖర్.. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నాడు.