Covidshield Doses Gap : కోవీషీల్డ్ డోసుల గ్యాప్‌ పెంపుపై భిన్నాభిప్రాయాలు

కోవీషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ రెండో డోసును 16 వారాలకు పెంచడం వెనుక ఏ శాస్త్రీయ ప్రాతిపదిక ఉందన్న ప్రశ్నలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. 

Covidshield Doses Gap : కోవీషీల్డ్ డోసుల గ్యాప్‌ పెంపుపై భిన్నాభిప్రాయాలు

Covidshield Vaccine Doses Gap Extended

Covidshield vaccine Doses Gap Extended : కోవీషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీకా మోతాదుల మధ్య గ్యాప్‌ పెంచడంపై సీరం సీఈఓ అదార్ పూనావాలా సానుకూలంగా స్పందించగా.. వ్యాక్సిన్ రెండో డోసును 16 వారాలకు పెంచడం వెనుక ఏ శాస్త్రీయ ప్రాతిపదిక ఉందన్న ప్రశ్నలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి.

వ్యాక్సిన్ డోసుల మధ్య విరామ కాలాన్ని ప్రస్తుతమున్న 6 నుంచి 8 వారాల నుంచి.. 12 నుంచి 16 వారాలకు పెంచడం మంచి నిర్ణయమన్నారు పూనావాలా. టీకా
సామర్థ్యాన్ని, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని, ఈ నిర్ణయం శాస్త్రీయంగా సరైందేనన్నారు. కోవీషీల్డ్ సహా పలు వ్యాక్సిన్లను 12 వారాల గ్యాప్‌లో రెండో డోసు ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతున్నట్లు గతంలో WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా చెప్పారు.

లాన్సెట్ మెడికల్ జర్నల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. రెండో డోసుకు 12 వారాల గ్యాప్ ఇవ్వడం ద్వారా వ్యాక్సిన్ 81శాతం మెరుగ్గా పనిచేస్తున్నట్లు తెలిపింది. అదే కేవలం ఆరు వారాల గ్యాప్‌తో వ్యాక్సిన్ రెండో డోసు ఇస్తే దాని సమర్థత కేవలం 55శాతం మేరకే ఉంటుందని వెల్లడించింది.

మరోవైపు యూకే, యూరోప్ దేశాలు ఆస్ట్రాజెనెకా రెండో డోసుకు 12 వారాల గ్యాప్‌ను మాత్రమే పాటిస్తుంటే భారత్‌ ఇలా 16 వారాలకు దాన్ని పొడగించడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో వ్యాక్సిన్ల కొరత నెలకొన్న కారణంగానే రెండో డోసు గ్యాప్‌ను ఇంతలా పెంచి ఉండవచ్చునని నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.