Russia Crude: రష్యా నుంచి చమురు దిగుమతి.. భారత్‌కు రూ.35,000 కోట్ల లబ్ధి

రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతుల్ని పెంచుకోవడం వల్ల మన దేశానికి దాదాపు రూ.35,000 కోట్లు లాభపడింది. రష్యా నుంచి ఇండియా తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తోంది. పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడం, భారత్‌కు కలిసొచ్చింది.

Russia Crude: రష్యా నుంచి చమురు దిగుమతి.. భారత్‌కు రూ.35,000 కోట్ల లబ్ధి

Russia Crude: రష్యా నుంచి ఇటీవల ఇండియా భారీ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే రష్యా నుంచి చమురు దిగుమతులు పెరిగాయి. అదీ తక్కువ ధరకే భారత్ చమురు కొనుగోలు చేస్తోంది.

Chandigarh University: ఛండీఘడ్ యూనివర్సిటీలో కొనసాగుతున్న నిరసనలు.. అధికారులు అబద్ధాలు చెబుతున్నారంటున్న విద్యార్థులు

దీనివల్ల ఇండియా రూ.35,000 కోట్లు లాభపడిందని అంచనా. గత ఫిబ్రవరిలో ఉక్రెయిన్‪పై రష్యా సైనిక చర్యకు దిగింది. దీంతో అమెరికాతోపాటు యూరప్ దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి చమురు దిగుమతుల్ని నిషేధించాయి. దీంతో రష్యాలో భారీ స్థాయిలో చమురు నిల్వలు మిగిలిపోతున్నాయి. అందుకే భారత్‌కు తక్కువ ధరకే చమురు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకుంది. రష్యా పరిస్థితి ఆధారంగా భారీ డిస్కౌంటు ధరకే చమురును ఇండియా దిగుమతి చేసుకుంటోంది. గతంలోకంటే ఎక్కువ స్థాయిలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం రష్యాకు ఇండియా రెండో అతిపెద్ద చమురు దిగుమతి దారుగా ఉంది.

Bone-chilling video: అమానుషం.. కుక్కను కారుకు కట్టుకుని ఈడ్చుకెళ్లిన డాక్టర్.. వీడియో వైరల్

మనదేశానికి క్రూడాయిల్ సరఫరా చేస్తున్న రెండో పెద్ద దేశంగా కూడా రష్యా నిలిచింది. గతంలో మన అవసరాల్లో ఒక్క శాతం మాత్రమే రష్యా నుంచి చమురు దిగుమతి అయ్యేది. ఇప్పుడు 12 శాతానికిపైగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశ చమురు అవసరాల కోసం ఎక్కువగా విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. దేశీయంగా 17 శాతం మాత్రమే చమురు ఉత్పత్తి అవుతుంటే, మిగతా 83 శాతం చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకోవడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు కలిగేలా చేస్తుంది.