BHVS Narayana Murthy : DRDO డీజీగా నారాయణ మూర్తి నియామకం

రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మిసైల్, స్ట్రాటజిక్ సిస్టమ్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బీహెచ్‌వీఎస్ నారాయణ మూర్తి శుక్రవారం నియమితులయ్యారు.

BHVS Narayana Murthy : DRDO డీజీగా నారాయణ మూర్తి నియామకం

Drdo

BHVS Narayana Murthy రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మిసైల్, స్ట్రాటజిక్ సిస్టమ్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బీహెచ్‌వీఎస్ నారాయణ మూర్తి శుక్రవారం నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ ఎంఎస్ఆర్ ప్రసాద్ పదవీ విరమణ నేపథ్యంలో ఈ నియామకం జరిగినట్లు డీఆర్‌డీవో ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపింది. హైదరాబాద్ లోని మిసైల్ లాబొరేటరీకి కూడా ఆయన డైరక్టర్ గా కొనసాగుతారాని తెలిపింది.

డాక్టర్ నారాయణ మూర్తి.. రక్షణ రంగ పరిశోధనలో విశేష కృషి చేస్తున్నట్లు డీఆర్‌డీవో తెలిపింది. రక్షణ రంగం, ఏరోస్పేస్ అప్లికేషన్స్ కోసం అత్యాధునిక ఏవియానిక్స్ టెక్నాలజీస్‌ను దేశీయంగా డిజైన్ చేయడం, అభివృద్ధిపరచడం కోసం విశేషంగా కృషి చేశారని పేర్కొంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌లోని ఏవియానిక్స్ లాబొరేటరీ అయిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ)కి డైరెక్టర్, ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఆయన నేతృత్వం వహించారు. ఏవియానిక్స్, మిసైల్స్, గైడెడ్ వెపన్ సిస్టమ్స్ డిజైన్, డెవలప్‌మెంట్, డెలివరీకి నేతృత్వం వహించారు. మూడు దశాబ్దాల నుంచి ఆయన అందిస్తున్న సేవలు అడ్వాన్స్‌డ్ రియల్ టైమ్ ఎంబెడెడ్ కంప్యూటర్స్, మిషన్ కంప్యూటింగ్ సిస్టమ్స్, ఇతర ఏవియానిక్స్ టెక్నాలజీస్‌లో భారత దేశం స్వయం సమృద్ధి సాధించడానికి దోహదపడుతున్నట్లు డీఆర్‌డీవో తెలిపింది.

దేశపు మొదటి యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ (ఏ-శాట్) మిషన్ శక్తికి, లాంగ్ రేంజ్ మిసైల్ అగ్ని 5కి అడ్వాన్స్‌ డ్ ఏవియానిక్స్ డిజైన్, డెవలప్‌మెంట్‌ కు నారాయణ మూర్తి నాయకత్వం వహించారు. వీటి వల్ల భారత దేశ స్వదీశీ రక్షణ రంగం మరింత పటిష్టమైందని డీఆర్‌డీవో తెలిపింది. BVRAAM అస్త్ర, QRSAM, ఆకాశ్ ఐఎస్, ఆకాశ్ ఎన్‌జీ, HSTDV, NGARM, లాంగ్ రేంజ్ గైడెడ్ బాంబ్స్, బ్రహ్మోస్, ATGM నాగ్, HELINA, MPATGM, SANT, BMD, ANSP, అగ్ని సిరీస్ మిసైల్స్, ఇతర గైడెడ్ వెపన్ సిస్టమ్స్ కోసం ఏవియానిక్స్ సిస్టమ్స్ అభివృద్ధి, డిమాన్‌స్ట్రేషన్‌లో నారాయణమూర్తి అత్యంత కీలక పాత్ర పోషించారని తెలిపింది.