WHO Warning On Syrups: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యంలో ఆ నాలుగు సిరప్‌లపై విచారణకు ఆదేశించిన సీడీఎస్‌సీఓ

భారత్‌లో తయారు చేసిన నాలుగు దగ్గు సిరప్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరిక జారీ చేయడంతో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) దర్యాప్తు ప్రారంభించింది.

WHO Warning On Syrups: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యంలో ఆ నాలుగు సిరప్‌లపై విచారణకు ఆదేశించిన సీడీఎస్‌సీఓ

cough syrups

WHO Warning On Syrups: భారత్‌లో తయారు చేసిన నాలుగు దగ్గు సిరప్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరిక జారీ చేయడంతో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) దర్యాప్తు ప్రారంభించింది. గాంబియా దేశంలో కిడ్నీలు దెబ్బతిని 66 మంది చిన్నారులు మరణించారు. ఈ మరణాలకు భారత్ దేశంలోని హర్యానాలోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన దగ్గు, జలుబు సిరప్ లకు సంబంధం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వీటిని వాడొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాక డబ్ల్యూహెచ్ఓ జనరల్ టెడ్రోస్ అదనోమ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత్ లోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన సిరప్ లు చిన్నారులను బలి తీసుకున్నాయని వెల్లడించారు. దీనిపై విచారణ ప్రారంభించామని అన్నారు.

Indian Cough Syrup: ఆ నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లను వాడొద్దు.. హెచ్చరికలు జారీచేసిన డబ్ల్యూహెచ్ఓ.. ఎందుకంటే?

చిన్నారుల మరణానికి సంబంధమున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంటున్న ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్‌మలిన్ బేబీ దగ్గు సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ లు భారత్ దేశంలోని హర్యానా రాష్ట్రంలో మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ నుండి ఉత్పత్తి అయినవి. ఈ మందుల్లో డబ్ల్యూహెచ్ఓ మొత్తం 23 నమూనాలను పరీక్షించింది. వీటిలో నాలుగు నమూనాలలో డైథైలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు కనుగొంది. డైథైలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ మానవులకు విషపూరితం, ప్రాణాంతకం అని డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది. వీటిని వాడితే.. పొత్తికడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, మూత్ర విసర్జన చేయలేకపోవడం, తలనొప్పి, మానసిక స్థితి, మూత్రపిండాలు దెబ్బతినడంతో మరణానికి దారితీయవచ్చునని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలపై భారత్ ప్రభుత్వం స్పందించింది.. సీడీఎస్‌సీఓ ఈ విషయాన్ని వెంటనే సంబంధిత స్టేట్ రెగ్యులేటరీ అథారిటీతో మాట్లాడిందని తెలిపింది. దీని పరిధిలో ఔషధాల తయారీ యూనిట్ ఉందని, ఇంకా, రాష్ట్ర డ్రగ్స్ కంట్రోలర్, హర్యానా (సంబంధిత రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీ) సహకారంతో ఈ విషయంలో వాస్తవాలు, వివరాలను తెలుసుకోవడానికి ఒక విచారణ కమిటీనిసైతం ఏర్పాటు చేసిందని తెలిపింది.