క్లాత్ మాస్క్ లేదా మెడికల్ మాస్క్‌లలో ఏది బెటర్

  • Published By: Subhan ,Published On : June 15, 2020 / 03:26 PM IST
క్లాత్ మాస్క్ లేదా మెడికల్ మాస్క్‌లలో ఏది బెటర్

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మెడికల్ మాస్క్ లేదా క్లాత్ మాస్క్ లు వాడుతూ జాగ్రత్త పడుతున్నాం. COVID-19 బారిన పడకూడదని తీసుకుంటున్న కేరింగ్ ఎంతవరకూ కరెక్ట్. దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ఓ క్లారిటీ ఇచ్చింది. వీడియో రిలీజ్ చేసి ఈ మాస్క్ లపై స్పందించింది. ఎక్కడెక్కడ వాడాలో, ఎంతవరకూ వాడాలో చెప్పింది. 

మెడికల్ మాస్క్‌లు ఒక్కసారి మాత్రమే వాడాలని.. క్లాత్ మాస్క్‌లను మళ్లీ వాడుకోవచ్చని తెలిపింది. అయితే క్లాత్ మాస్క్ లు వాడిన ప్రతీసారి వేడినీటిలో ఉతకాలని వెల్లడించింది. మాస్క్ ధరించేటప్పుడు పాటించాల్సిన కొద్ది సూచనలను తెలిపింది. పరిస్థితులకు తగ్గట్లుగా మాస్క్ లు ఎంచుకుని వాడాలి. 

‘పబ్లిక్ ప్లేసులలో సోషల్ డిస్టన్స్ వాడాల్సిన సమయంలో ఇంట్లో తయారుచేసిన క్లాత్ మాస్క్ లు వాడుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మాస్క్ మొత్తం ఓ 5లేయర్లతో ఉండాలి. గాలిని తనగుండా పోనిస్తూ ఫిల్టర్ చేసేదిగా ఉండాలి’ అని అపోలో హాస్పిటల్స్ ఇంద్రప్రస్థ, రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ డా.వినీ కాంత్రో అంటున్నారు. 

మెడికల్ (సర్జికల్) మాస్క్‌లు:
హెల్త్ కేర్ వర్కర్స్
COVID-19లక్షణాలు ఉన్న వాళ్లు
కరోనా వైరస్ లక్షణాలున్న అనుమానితులు
60ఏళ్లు పైబడిన వారు
ఆరోగ్య పరిస్థితులు విషమంగా ఉన్న వారు. 

క్లాత్ మాస్క్‌లు:
COVID-19లక్షణాలు లేని వారు
కరోనా వైరస్ పేషెంట్లు లెక్కకు మించి దూరంలో ఉన్నప్పుడు 
ఫిజికల్ డిస్టన్స్ కనీసం ఒక మీటర్ కంటే ఎక్కువ పాటిస్తున్న ప్రాంతంలో
సోషల్ వర్కర్లు, క్యాషియర్లు, సర్వర్లుగా పనిచేస్తున్నవారు
పబ్లిక్ ట్రాన్స్ పోర్టులు అయిన బస్సుల్లో, కార్లలో, రైళ్లలో, వర్క్ ప్లేసుల్లో, కిరాణా దుకాణాల్లో, గుంపులుగా ఉన్న పరిసరాల్లో వాడొచ్చని వీడియోలో పేర్కొంది.