Farmer protest : రైతుల ఉక్కు పిడికిలి..జూన్ 26న రాజ్ భవన్‌‌ల ముట్టడి

నాటి ప్రధాని ఇందిరగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజే కేంద్రానికి షాకిచ్చేలా రైతులు ఉక్కుపిడికిలి బిగించారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్‌ 26న రైతులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని రాజ్‌భవన్‌లను ముట్టడించాలని కిసాన్‌ సంయుక్త మోర్చా పిలుపునిచ్చింది.

Farmer protest : రైతుల ఉక్కు పిడికిలి..జూన్ 26న రాజ్ భవన్‌‌ల ముట్టడి

India Farmers Protest

Farm laws Farmers Protest : నాటి ప్రధాని ఇందిరగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజే కేంద్రానికి షాకిచ్చేలా రైతులు ఉక్కుపిడికిలి బిగించారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్‌ 26న రైతులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని రాజ్‌భవన్‌లను ముట్టడించాలని కిసాన్‌ సంయుక్త మోర్చా పిలుపునిచ్చింది. 40 రైతు సంఘాల ఐక్యవేదిక అయిన కిసాన్ సంయుక్త మోర్చా ప్రతినిధులు ఈ మేరకు ఉద్యమకార్యాచరణ వెల్లడించారు.

కరోనా సమయంలోనూ వెనుకడుగు వేసేదే లేదంటూ.. కేంద్రం కంటే మొండిగా రైతులు నిరసనలను కొనసాగిస్తునే ఉన్న సంగతి తెలిసిందే. వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రం పలు దఫాలుగా చర్చలు జరిపినా..సఫలం కాలేదు. దీంతో రైతులు తమ నిరసనల్ని తీవ్రతరం చేశారు.

గతంలో ఢిల్లీలో రైతులు కదం తొక్కారు. ఈ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. తాజాగా..ఈనెల 26న అన్ని రాజ్ భవన్‌ల ఎదుట రైతులు నల్ల జెండాలతో నిరసనలు చేపట్టానున్నారు. గవర్నర్ నివాసాలను ముట్టడించనున్నారు. కొవిడ్ నిబందనలు పాటిస్తూ, శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని కిసాన్ సంయుక్త మోర్చా తెలిపింది. నిరసనల్లో భాగంగానే గవర్నర్ల ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మెమోరండాలు పంపుతామని వెల్లడించింది.

ఈనెల 26ను సేవ్‌ ఫార్మింగ్‌, సేవ్‌ డెమోక్రసీ దినంగా పాటించనున్నట్లు రైతు సంఘాల నేతలు వెల్లడించారు. 1975లో సరిగ్గా అదే రోజు అప్పటి ప్రధాని ఇందిరా దేశంలో ఎమర్జెన్సీ విధించారని, ప్రస్తుతం భారత్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందన్నారు.

Read Morer : Huzurabad Bypoll : ఈటల వీటికి సమాధానాలు చెప్పాలి – కౌశిక్ రెడ్డి