Mark Zuckerberg: ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్‌పై యూపీలో కేసు

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ను కించపరిచేలా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టినందుకుగానూ ఉత్తర్‌ప్రదేశ్ లోని..

Mark Zuckerberg: ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్‌పై యూపీలో కేసు

Mark Zukerberg

Mark Zuckerberg: ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ను కించపరిచేలా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టినందుకుగానూ ఉత్తర్‌ప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలోని కోర్టులో అతనితో పాటు 49మందిని నిందితులుగా పేర్కొంటూ కేసు పెట్టారు. నిజానికి అఖిలేశ్ యాదవ్ కు వ్యతిరేకంగా జూకర్ బర్గ్ పోస్టు పెట్టకపోయినా అతని ప్లాట్ ఫాం వేదికగా కించపరిచే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సరాహతి గ్రామంలో ఉండే అమిత్ కుమార్ అనే వ్యక్తి.. జూకర్ బర్గ్ తో పాటు మరో 49మందిపై కించపరిచే కామెంట్లు చేస్తున్నారంటూ ఫిర్యాదుచేశారు. ఆ అప్లికేషన్ లో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ను కించపరుస్తున్నారంటూ.. Bua Babua ఫేస్ బుక్ పేజి మీద కంప్లైంట్ చేశారు.

ఇన్వెస్టిగేషన్ లో జూకర్ బర్గ్ తప్పించి మిగిలిన వారిపై విచారణ జరుపుతున్నాం. ఆ ఫేస్ బుక్ పేజి అడ్మినిస్ట్రేటర్ ను ఎంక్వైరీ చేస్తున్నాం. అని సీనియర్ జిల్లా పోలీస్ అధికారి మీడియాతో అన్నారు. చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ధరమ్ వీర్ సింగ్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

,…………………………………….. : కిరణ్ అబ్బవరం అన్నయ్య మృతి..

కుమార్ మే25న ఎస్పీకు లేఖ ద్వారా విషయాన్ని తెలియజేసినప్పటికీ పట్టించుకోలేదు. తన ఫిర్యాదు పట్టించుకోవడం లేదని ఓ అడుగు ముందుకేసి ఫేస్ బుక్ పేజి అడ్మిన్, సీఈఓ జూకర్ బర్గ్ పైనా కేసు పెట్టాడు.