తడిసిపోతున్నాయి : యోగి హయాంలో రికార్డ్ ఎన్ కౌంటర్లు

  • Published By: venkaiahnaidu ,Published On : January 25, 2019 / 06:04 AM IST
తడిసిపోతున్నాయి : యోగి హయాంలో రికార్డ్ ఎన్ కౌంటర్లు

ఉత్తరప్రదేశ్ లో నేరస్థులకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు వినబడితేనే ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి. సీఎం అయినప్పటినుంచి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల యోగి ప్రత్యేక దృష్టి పెట్టారు. 2017 మార్చి 19న  యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూపీ పోలీసులకు నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ఆదేశించారు. దీంతో 2017 మార్చి నుంచి 2018 జులై వరకు యూపీ పోలీసులు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 3వేల ఎన్ కౌంటర్లు నిర్వహించారు. దాదాపు 78 నేరస్థులను ఎన్ కౌంటర్ లో కాల్చి పడేసినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.  

రిపబ్లిక్ డే రోజున రాష్ట్రంలో   ప్రభుత్వ విజయాల లిస్ట్ కింద ఎన్ కౌంటర్ల సంఖ్య, చనిపోయిన నేరస్థుల సంఖ్య, అరెస్టుల లిస్ట్ ను ప్రచారం చేయనున్నారు. ప్రభుత్వ విజయాల లిస్ట్ గా తెలుపుతూ..ఇప్పటికే ఈ జాబితా సమాచారాన్నియూపీ చీఫ్ సెక్రటరీ అనుప్ చంద్ర పాండే   అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. వాంటెడ్ నేరస్థులను అరెస్ట్ చేసి క్రిమినల్స్ ని కట్టడి చేసి రాష్ట్రంలో నేరాల సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్త క్యాంపెయిన్ ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అధికారిక లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి జులై 2018 వరకు అంటే యోగి 16నెలల పరిపాలనా కాలంలో మొత్తం 3వేల 26 ఎన్ కౌంటర్లు జరిగాయి. 69 మంది నేరస్థులు ఎన్ కౌంటర్ లో చనిపోయారు. 7వేల 43మంది నేరస్థులు అరెస్ట్ అయ్యారు. 838 మంది నేరస్థులుకు గాయాలయ్యాయి. అదే సమయంలో 11వేల 981 మంది నేరస్థుల బెయిల్ రద్దు అయి కోర్టుల్లో సరెండర్ అయ్యారు.

యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత నేరాలు తగ్గుముఖం పట్టాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. యోగి కాషాయ వస్త్ర ధారణలో గన్ చేతపట్టుకొని పక్కన ఆవుతో నిలబడి ఉన్న జిలా గోరఖ్ పూర్  మూవీ పోస్టర్ గతేడాది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. యోగి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.