తాజ్ మహల్ చూసేవారి సంఖ్య బాగా తగ్గిందట!

తాజ్ మహల్ చూసేవారి సంఖ్య బాగా తగ్గిందట!

ప్రపంచంలోని ఎనిమిది అద్భుతాలలో ఒకటిగా.. ప్రేమకు చిహ్నమైన కట్టడం తాజ్‌మహల్ పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గతంతో పోలిస్తే దాదాపు 76 శాతం మంది పర్యాటకులు తగ్గిపోయారు. కరోనా మహమ్మారిపై పర్యాటక రంగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపగా.. తాజ్‌మహల్ సందర్శకులపై విపరీతమైన ప్రభావం చూపింది కరోనా.

కరోనా కారణంగా, తాజ్‌మహల్ సందర్శించే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గగా.. 2019 సంవత్సరంతో పోల్చితే, 2020లో తాజ్ సందర్శించే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. నాలుగింట మూడొంతుల కంటే ఎక్కవ శాతమే తగ్గింది. తాజ్ మహల్ సందర్శించే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిందని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) సూపరింటెండెంట్ వసంత స్వర్ణకర్ వెల్లడించారు. 2019 సంవత్సరంతో పోల్చితే, గతేడాది 2020లో పర్యాటకుల సంఖ్య 76 శాతం తగ్గింది.

తాజ్ మహల్ సందర్శకుల సంఖ్య తగ్గడానికి కరోనా మహమ్మారి అతిపెద్ద కారణం అని చెబుతున్నారు. కరోనా కారణంగా తాజ్‌మహల్ చాలాకాలం నుంచి మూసివేయబడగా.. తెరిచిన తర్వాత కూడా పర్యాటకుల పరిమితిని అమలు చేసింది ప్రభుత్వం. కరోనా కాలంలో, పెద్ద సంఖ్యలో ప్రజలు రాకను తగ్గించారు. అదే సమయంలో, భారతదేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో తాజ్ మహల్ సందర్శకులు తగ్గారు.

తాజ్ మహల్ ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం క్రీ.శ 1643లో నిర్మించగా.. తెల్ల పాలరాయితో తయారు చేసిన తాజ్ మహల్‌కు 350 సంవత్సరాల చరిత్ర ఉంది. యమునా ఒడ్డున ప్రజలను ఆకర్షించే కేంద్రంగా ఉండగా.. తాజ్‌మహల్ సందర్శనకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు భారీగానే వస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తాజ్ మహల్ చూడడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.