రాహుల్‌ గాంధీకి పెళ్ళికాలేదు.. యువతులు జాగ్రత్త.. : మాజీ ఎంపీ కామెంట్లపై కాంగ్రెస్ సీరియస్..

రాహుల్‌ గాంధీకి పెళ్ళికాలేదు.. యువతులు జాగ్రత్త.. : మాజీ ఎంపీ కామెంట్లపై కాంగ్రెస్ సీరియస్..

Former Idukki Mp Joyce George Condemn This Misogynistic Comment By Joyce George

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోరు ఇప్పుడు రాజకీయ నాయకుల మధ్య హీట్ పెంచేసింది. ఈ సమయంలో కాస్త శృతిమించిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కాంట్రవర్శియల్ అవుతున్నాయి. లేటెస్ట్‌గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురించి కేరళకు చెందిన మాజీ ఎంపీ అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహానికి కారణం అవుతోంది.

మాజీ ఎంపీ జాయిస్ జార్జ్ చేసి ప్రకటనపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల కమిషన్లో ఫిర్యాదు చేసింది. ఇడుక్కి జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ బ్యాచిలర్ అని ఆయనతో కాలేజీ యువతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాహుల్ కేవలం మహిళల కళాశాలలకే వెళ్తున్నారని, అక్కడికి వెళ్లి వారిని ఒంగమని చెబుతున్నారని.. దయచేసి విద్యార్థినిలు ఆలా చేయొద్దంటూ కాంట్రవర్శియల్ కామెంట్లు చేశారు. రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదని.. ఆయనకు అదే పని అని జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇడుక్కి జిల్లాలో ఎంఎం మణి అనే అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్న సమయంలో జార్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ లేటెస్ట్‌గా కొచ్చిలో సెయింట్ థెరెసా కాలేజీకి వెళ్లారు అక్కడ విద్యార్థినిలకు ఐకిడోలో శిక్షణ ఇచ్చారు రాహుల్.. ఐకిడోలో నిపుణుడైన రాహుల్.. విద్యార్థులు తమను తాము ఎలా రక్షించుకోవాలి అనే దానిపై ప్రాక్టికల్‌గా శిక్షణ ఇచ్చారు. ఐకిడో భంగిమల్లో కనిపించి విద్యార్థినులను.. దృష్టిలో ఉంచుకొని జార్జ్ చెత్త వ్యాఖ్యలు చేసినట్లుగా కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది.

జాయిస్ చేసిన కామెంట్స్‌ను కేరళ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల తీవ్రంగా ఖండించారు. రాహుల్‌నే కాదు మహిళలను కూడా జాయిస్ కించపరిచారని మండిపడ్డారు. ఎదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హితవుపలికారు. కేరళ ముఖ్యమంత్రి పినరియి విజయన్ కూడా జాయిస్ వ్యాఖ్యలను ఖండించారు. ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు.