కన్హయ్య కుమార్ వాహనంపై రాళ్ల దాడి..ఉద్రిక్తత

  • Published By: madhu ,Published On : February 5, 2020 / 03:29 PM IST
కన్హయ్య కుమార్ వాహనంపై రాళ్ల దాడి..ఉద్రిక్తత

JNUSU మాజీ అధ్యక్షుడు, సీపీఐ లీడర్ కన్హయ్య కుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా ఆయన జన్ గన్ మన్ పేరిట యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA, NRCలకు వ్యతిరేకంగా కన్హయ్య పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా బీహార్ రాష్ట్రంలో పర్యటించేందుకు ఆయన వాహనంలో బయలుదేరారు. 

 

కోపా బజార్‌లోని చాప్రా – శివాన్ మెయిన్ రోడ్డు వద్దకు చేరుకోగానే దాదాపు 20 – 25 మంది యువకులు రాళ్లతో కన్హయ్య కుమార్ వాహనంపై దాడికి దిగారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయలు కాలేదని SHO కోపా శివనాథ్ రామ్ వెల్లడించారు. కానీ ఆయన ప్రయాణిస్తున్న వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. 

దాడి ఎవరు చేశారో గుర్తించలేదని, దాడి చేసిన అనంతరం దుండగులు తప్పించుకున్నారన్నారు. శివాన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు కన్హయ్య వెళుతున్నాడన్నారు. దాడి అనంతరం ఆయన అనుచరులు, విద్యార్థులు ఇతర మార్గం గుండా..వెళ్లిపోయారు.  గోపాల్ గంజ్‌లో కన్హయ్య పర్యటనను కొంతమంది వ్యతిరేకించారు. గో బ్యాక్ అంటూ పోస్టర్లు వెలిశాయి. 

ప్రఖ్యాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కొన్నో రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. 
కేంద్రం తీసుకొచ్చిన NRC, CAAకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 
* 2020, జనవరి 05వ తేదీ ఆదివారం రాత్రి JNU క్యాంపస్ లోకి వెళ్లి విద్యార్థులు, ఫ్యాకల్టీపై దాడికి పాల్పడడం ఉధృతం మరింత తీవ్రరూపం దాల్చింది. 
 

సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. 
జేఎన్‌యూ విద్యార్థులపై దాడికి హిందూ రక్షా దళ్ బాధ్యతను ప్రకటించుకుంది. 
పలు రాష్ట్రాలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. అమలు చేసేది లేదని తేల్చిచెబుతున్నాయి. 
షాహీన్‌బాగ్‌లో జరిగిన ఆందోనళలో ఓ వ్యక్తి కాల్పులకు దిగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.