HC : సీబీఐ పరిస్థితి పంజరంలో చిలుకలా ఉంది..దాన్ని విడిపించండి:మద్రాస్​ హైకోర్ట్

సీబీఐ పరిస్థితి పంజరంలో రామచిలుకలా మారిపోయింది అనీ..దాన్ని విడిపించాలి అంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

HC : సీబీఐ పరిస్థితి పంజరంలో చిలుకలా ఉంది..దాన్ని విడిపించండి:మద్రాస్​ హైకోర్ట్

' Free Caged Parrot Cbi' Madras Hc (1)

‘ Free Caged Parrot CBI’ say Madras HC :సీబీఐపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ ( సీబీఐపసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) పరిస్థితి పంజరంలో రామచిలుకలా మారిపోయింది అంటూ కనీవినీ ఎరుగని సంచలన వ్యాఖ్యలుచేసింది. సీబీఐ వెంటనే పంజరం నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో సీబీఐ కీలుబొమ్మలా మారిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని పేర్కొంది. ఎన్నికల సంఘం, కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాదిరిగానే సీబీఐ కూడా స్వతంత్ర సంస్థలా ఉండాలని, అది కేవలం పార్లమెంట్ కే రిపోర్ట్ చేయాలని సూచించింది.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పార్లమెంటుకు మాత్రమే నివేదించే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం (ఆగస్టు 16,2021) ఈ వ్యాఖ్యలు చేసింది. తమిళనాడులో జరిగిన ‘పోంజీ’ స్కామ్ పై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ ఎన్. కిరుబాకరన్, జస్టిస్ బి. పుగళెందిల ధర్మాసనం విచారణ జరిపిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. సీబీఐ వ్యవస్థలో మార్పులకు కోర్టు 12 పాయింట్ల నిర్మాణాత్మక సూచనలను చేసింది. సీబీఐకి చట్టబద్ధ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వీలైనంత త్వరగా సీబీఐ అధికారాలు, పరిధులు పెంచి.. సంస్థకు చట్టబద్ధ హోదా ఇచ్చేలా ఓ చట్టాన్ని చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది. సీబీఐపై ప్రభుత్వ పెత్తనం లేకుండా చూడాలని హైకోర్టు కీలక సూచనలతో కూడిన వ్యాఖ్యలు చేసింది.డీవోపీటీకి కాకుండా నేరుగా ప్రధాన మంత్రి లేదా మంత్రికే రిపోర్ట్ చేసేలా కార్యదర్శి స్థాయి హోదాను సీబీఐ డైరెక్టర్ కు ఇవ్వాలని సూచించింది. ఎక్కువ మంది సిబ్బంది లేరని పోంజీ స్కామ్ కేసును బదిలీ చేయటానికి కేంద్రం నిరాకరించడంతో..

సీబీఐలో వెంటనే క్యాడర్ పెంచాల్సిందిగా కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. నెల రోజుల లోపులో ఈ నియామకాలు చేపట్టాలని సూచించింది. అమెరికా ఎఫ్ బీఐ, బ్రిటన్ స్కాట్లాండ్ యార్డ్ లాగా సీబీఐని బలోపేతం చేయాలని, అందుకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని కేంద్రానికి ఆదేశాలిచ్చింది.

కాగా సీబీఐ, ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ వంటివి స్వయం ప్రతిపత్తిగా విధులు నిర్వహించే సంస్థలు. వారిపై ప్రభుత్వాల ఆంక్షలు ఉండకూడదు. కానీ ఇటీవల కాలంలో ఈ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తున్నాయనే విమర్శలు, ఆరోపణలు వస్తు్న్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే సమయంలో కూడా ప్రభుత్వాలు ఎన్నికల సంఘాన్ని నిర్ధేశిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్న క్రమంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ సంచలన ఆదేశాలు చర్యనీయాంశంగా మారాయి.