కరోనా వ్యాక్సిన్ “ఫ్రీ” : బీహార్ లో బీజేపీ…తమిళనాడులో సీఎం హామీ

  • Published By: venkaiahnaidu ,Published On : October 22, 2020 / 05:55 PM IST
కరోనా వ్యాక్సిన్ “ఫ్రీ” : బీహార్ లో బీజేపీ…తమిళనాడులో సీఎం హామీ

Free COVID-19 vaccine for all కరోనా వ్యాక్సిన్ రెడీ అవగానే తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందిచనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. వ్యాక్సిన్ కోసం ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి వసూలు చేయబోమని పళనిస్వామి తెలిపారు.



దేశంలో కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు నాలుగో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడులో ఇప్పటివరకు 7లక్షల కరోనా కేసులు నమోదుకాగా 10వేలమందికి పైగా కరోనాతో మరణించారు. బుధవారం రాత్రి సమయానికి తమిళనాడులో మొత్తం 91.9లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.



కాగా,ఇవాళ ఉదయం బీహార్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ కూడా బీహార్ రాష్ట్రంలో వ్యాక్సిన్ ఉచిత పంపిణీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ ఇవాళ విడుదల తమ బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో కరోనా వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా ఇస్తాం అంటూ ఇచ్చిన హామీ పెద్ద వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి ఆప్ వరకు విపక్షాలు బీజేపీ హామీపై విమర్శలు గుప్పించాయి. బీహార్ లో మాత్రమే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేస్తారా…మిగిలిన రాష్ట్రాల ప్రజల సంగతేంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పుడే దేశపు కరోనా అందుబాటు వ్యూహాన్ని ప్రకటించిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.



బీజేపీకి ఓటు వేయనివాళ్లకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ దక్కుతుందా అంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సంగంతేంటని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేయని భారతీయులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ లభించదా అని ఢిల్లీ సీఎం ప్రశ్నించారు.