ఢిల్లీ వాసులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

18ఏళ్లు దాటిన ఢిల్లీ వాసులందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని సోమవారం ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్ ప్రకటించారు.

ఢిల్లీ వాసులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

Free Vaccine For Delhiites Above 18

Free vaccine 18ఏళ్లు దాటిన ఢిల్లీ వాసులందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని సోమవారం ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్ ప్రకటించారు. 1.34 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్‌ కొనుగోలుకు ఇవాళ ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్ కొనుగోలును వేగవంతం చేసి..వీలైనంత త్వరగా వాటిని ప్రజలకు అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని కేజ్రీవాల్‌ తెలిపారు.

ఈ సందర్భంగా వ్యాక్సిన్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం, తయారీ సంస్థలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాక్సిన్లకు ఒకే ధర ఉండాలన్నారు. వ్యాక్సిన్ ఒక డోసు ధరను రూ.150కి తగ్గించాలని వ్యాక్సిన్ తయారీసంస్థలను కేజ్రీవాల్ కోరారు. ఇది మానవాళికి సహాయం చేయాల్సిన సమయమని.. ఈ సమయంలో లాభాపేక్ష ఉండకూడదని కేజ్రీవాల్‌ అన్నారు. ఒక వ్యాక్సిన్ తయారీ సంస్థ..రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు రూ.400కి అందిస్తామని చెప్పిందని,మరో వ్యాక్సిన్ తయారీ సంస్థ..రాష్ట్రప్రభుత్వాలకు ఒక్కో డోసు రూ.600కి అందిస్తామని చెప్పాయని…కానీ రెండు వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రప్రభుత్వానికి ఒక్కో డోసుని రూ.150కి అందిస్తామని ప్రకటించాయని కేజ్రీవాల్ తెలిపారు. వ్యాక్సిన్ ధర అందరికీ ఒకేలా ఉంటాయని తాను ఆశిస్తున్నానని కేజ్రీవాల్ తెలిపారు.

18ఏళ్ల లోపు చిన్నారులు కూడా కరోనా బారినపడుతున్నారని,ఇది వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కూడా ఆలోచించాల్సిన సమయమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. చిన్నారులకు ఈ వ్యాక్సిన్లు సురక్షితమైనవి మరియు ప్రభావవంతమైనవి అయితే వారు వీటిని అందిచాలన్నారు. అలా కాకుంటే, చిన్నారులకు సురక్షితమైన,ప్రభావంతమైన కొత్త వ్యాక్సిన్లు త్వరలోనే డెవలప్ చేయబడతాయని తాను ఆశిస్తున్నానని కేజ్రీవాల్ తెలిపారు.

ఇక, ఢిల్లీలోని ఛతార్​పుర్​లోని ఇండో-టిబెటన్​ సరిహద్దు పోలీసు(ఐటీబీపీ) ఆధ్వర్యంలోని సర్దార్​ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్​ సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభమైందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఆస్పత్రిని సీఎం కేజ్రీవాల్ సందర్శించారు. ఈ సెంటర్​లో 500 ఆక్సిజన్ పడకలు ఉన్నాయని, త్వరలోనే మరో 200 ఐసీయూ పడకలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రికి వైద్యులు, సిబ్బందికి అందించిన కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీవాల్ కృతజ్ఞతలు కేజ్రీవాల్ తెలిపారు