Free Vaccine,Foodgrains : ఉచిత వ్యాక్సిన్,రేషన్ కోసం కేంద్రం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా!

దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు అందించే బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని, అదేవిధంగా..ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం కింద 80కోట్ల మందికి దీపావళి వరకు ఉచితంగా రేషన్‌(ప్రతి నెలా 5 కిలోల బియ్యం, కేజీ పప్పులు)అందించనున్నట్లు సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Free Vaccine,Foodgrains : ఉచిత వ్యాక్సిన్,రేషన్ కోసం కేంద్రం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా!

Free Vaccine,foodgrains

Free Vaccine,Foodgrains దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు అందించే బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని, అదేవిధంగా..ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం కింద 80కోట్ల మందికి దీపావళి వరకు ఉచితంగా రేషన్‌(ప్రతి నెలా 5 కిలోల బియ్యం, కేజీ పప్పులు)అందించనున్నట్లు సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉచిత వ్యాక్సిన్, రేషన్‌ కోసం కేంద్రం దాదాపు రూ. 1.45లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంగళవారం కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఉచితంగా వ్యాక్సిన్ ల కోసం 45-50 వేల కోట్ల ఖర్చవనుంది. కొవిడ్ నిర్వహణ కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన రూ. 35వేల కోట్ల కంటే ఇది చాలా ఎక్కువే. ఇక, ఉచిత రేషన్ కార్యక్రమానికి దాదాపు రూ. 1.1-1.3లక్షల కోట్ల వరకు ఖర్చు కానుందని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తంగా టీకాలు, రేషన్‌ కి కలిపి దాదాపు రూ. 1.45లక్షల కోట్ల మేర కేంద్రంపై అదనపు భారం పడనుంది.

అయితే ఇందుకోసం ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి రూ. 99,122 కోట్ల డివిడెంట్‌ రానుంది. ఇక పెట్రోల్‌, డీజీల్‌పై పన్నుల రూపంలోనే కేంద్రానికి చెప్పుకోదగ్గ ఆదాయమే లభించింది. ఈ నిధుల నుంచి వ్యాక్సిన్లు, రేషన్‌ కోసం ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.