CAA ఎఫెక్ట్ : ప్రార్థనల కోసం..ఇంటర్నెట్ నిలిపివేత

  • Published By: madhu ,Published On : December 26, 2019 / 03:31 PM IST
CAA ఎఫెక్ట్ : ప్రార్థనల కోసం..ఇంటర్నెట్ నిలిపివేత

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా సద్దుమణగడం లేదు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కానీ పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. 17 మంది చనిపోగా..200 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి.

ఈ క్రమంలో…2019, డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం..సందర్భంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. వివిధ నగరాల్లో ఇంటర్నెట్ సర్వీసును నిలిపివేశారు. బులంద్ షహర్, ఆగ్రా ఇతర ప్రాంతాల్లో ఇంటర్ నెట్ నిలిపివేశారు. డిసెంబర్ 28వ తేదీ ఉదయం వరకు కొనసాగనుంది. ఆగ్రాలో మాత్రం డిసెంబర్ 27 వరకు సేవలు కొనసాగవు. బులంద్ షహర్ డిసెంబర్ 26వ తేదీ సాయంత్రం 5గంటల నుంచే సేవలను నిలిపివేశారు. డిసెంబర్ 28వ తేదీ శనివారం ఉదయం 5 గంటలకు సేవలు మూసివేయడుతాయి.

నిరసనల నేపథ్యంలో ముందు జాగ్రత్తలో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగం ఈ విధంగా నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. పుకార్లు వ్యాప్తి చెందకుడా..ఉండటానికి సహారాన్ పూర్ లో డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం వరకు ఇంటర్ నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు పోలీసులు మైక్ ల ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించి టెలికాం సర్వీసు ప్రోవైడర్లకు ఒక లేఖ పంపడం జరిగిందని..ఎస్ఎస్పీ దినేష్ కుమార్ వెల్లడించారు. 

నగరం శాంతి నెలకొనడానికి సహారాన్ పూర్ లో స్థానిక నాయకులు, మత సంస్థలను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా సోషల్ మీడియాలో పుకార్లు పోస్టు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు. ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అల్లర్లకు పాల్పడవద్దని, శాంతియుతంగా మెలగాలని సూచించారు. 
 

* గత శుక్రవారం ఆగ్రా నగరంలో నిరసనలు హింసాత్మకరూపకంగా మారాయి. 
* ఆలీఘర్, హత్రాస్, ఫిరోజాబాద్ లో సైతం ఘర్షణలు చెలరేగాయి. 
* బిజ్నోర్ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 
 

* డియోబంద్ ప్రాంతంలో కూడా సేవలను క్లోజ్ చేశారు. తదుపరి ఆదేశాల అందే వరకు ఆంక్షలు కొనసాగుతాయని పోలీసు అధికారులు వెల్లడించారు. 
* ఘజియాబాద్ లో డిసెంబర్ 26వ తేదీ రాత్రి 10 నుంచి డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం రాత్రి 10గంటల వరకు సేవలను నిలిపివేయనున్నారు.
* ఇక మధురలో డిసెంబర్ 26వ తేదీ సాయంత్రం 6 నుంచి 24 గంటల పాటు ఇంటర్ నెట్ అందుబాటులో ఉండదు. 
Read More : క్రిస్మస్ జరుపుకున్న అమీర్ ఖాన్..నెటిజన్ల మండిపాటు..స్ట్రాంగ్ రిప్లై