Tomato flu: భయపెడుతున్న టొమాటో ఫ్లూ.. దేశంలో పెరుగుతున్న కేసులు

దేశంలో టొమాటో ఫ్లూ వ్యాధి భారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రంలోనూ టొమాటో ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అయితే ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తిస్తున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనలతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి...

Tomato flu: భయపెడుతున్న టొమాటో ఫ్లూ.. దేశంలో పెరుగుతున్న కేసులు

Tomato Flu

Tomato flu: దేశంలో టొమాటో ఫ్లూ వ్యాధి భారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రంలోనూ టొమాటో ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అయితే ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తిస్తున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనలతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. జ్వపీడితులు, జ్వరం ఎక్కువగా ఉన్న పిల్లలకు రక్త పరీక్షలు, ఇతర పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ వ్యాధి ఐదేళ్లలోపు చిన్నారుల్లో.. అదీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నపిల్లలకు త్వరగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిఫుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మే 6నుండి కేరళలో 82మంది శిశువులకు ఈ వ్యాధి సోకింది. అధిక జ్వరం, చేతులు, కాళ్ళు తిమ్మిర్లు, నోటిలో ఎర్రటి దద్దుర్లు, చిన్నబొబ్బలు కనిపిస్తే టొమాటో లక్షణాలని వైద్యులు పేర్కొంటున్నారు. ఇది ఎక్కువగా డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాధి లక్షణాలను పోలి ఉంటుంది.

Tomato Flu : భారత్ లో టొమాటొ ఫ్లూ కలకలం..ఒడిశాలో 26 మంది చిన్నారులకు వైరస్

టొమాటో ఫ్లూ ప్రాణాంతకమైన వ్యాధికాదు. కానీ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వేగంగా వ్యాపిస్తోంది. అయితే రెండు రోజుల క్రితం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రంలో 36 నమూనాలను సేకరించి పరీక్షించగా, 26 హెచ్‌ఎఫ్‌ఎమ్‌డి పాజిటివ్‌గా గుర్తించినట్లు అక్కడి వైద్య సిబ్బంది తెలిపారు. హెచ్‌ఎఫ్‌ఎమ్‌డి బారిన పడిన 26 మంది పిల్లలలో 19 మంది భువనేశ్వర్‌కు చెందినవారు, ముగ్గురు పూరీకి చెందినవారు. ఇద్దరు కటక్, పూరీలకు చెందిన వారు ఉన్నారని అక్కడి అధికారులు తెలిపారు. టొమాటో ఫ్లూ వ్యాధి ప్రాణాలు తీసేంత ప్రమాదకారి కాకపోయినా.. దీనికి ప్రత్యేక చికిత్స అనేది ఏమీలేదని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధి సోకిన రోగులు.. రోగనిరోధక శక్తిని పెంచే పానియాలను తీసుకోవటంతో పాటు విశ్రాంతి తీసుకోవాలని, వైద్యులు సూచించిన మందులు వాడుతూ.. కొద్దిరోజులు ఒంటరిగా ఓ గదిలో ఉండాలని, వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, శరీరంలో నీటిస్థాయి తగ్గకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Tomato Flu: టమాటో ఫ్లూ కలకలంతో కేరళ సరిహద్దుల వద్ద నిఘా పెంచిన తమిళనాడు ప్రభుత్వం

టొమాటో వ్యాధిపై న్యూఢిల్లీ ఏఐఐఎంఎస్ లోని పిడియాట్రిక్స్ అండ్ ప్రివెన్షన్ విభాగానికి చెందిన డాక్టర్ అమోల్ కుమార్ లోకాడ మాట్లాడుతూ.. టొమాటొ వ్యాధి సోకడానికి గల కారణాలపై ఇంకా ఎలాంటి క్లారిటీలేదని అన్నారు. అయితే ఇది ఏదో వైరస్ కారణంగా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. ఈ వైరస్ చికెన్, స్మాల్ పాక్స్ లాగా ఉంటుంది. టొమాటో ఫ్లూ ఒక అంటు వ్యాధి అని, ఇది సోకిన పిల్లల నుంచి ఇతర పిల్లలకు వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, అలాఅని పిల్లలకు ఈ ప్లూ సోకితే తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. పిల్లల్లో టొమాటో ప్లూ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.