Ganga Nayak: తమిళనాడు ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ తొలి గెలుపు

గంగా నాయక్ తమిళనాడు ఎన్నికల్లో చరిత్ర లిఖించింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా వండర్ క్రియేట్ చేసింది.

Ganga Nayak: తమిళనాడు ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ తొలి గెలుపు

Tamilnadu

Ganga Nayak: గంగా నాయక్ తమిళనాడు ఎన్నికల్లో చరిత్ర లిఖించింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా వండర్ క్రియేట్ చేసింది. వేల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన 37వ వార్డు విజేతగా నాయక్ ను డీఎంకే ప్రభుత్వం ప్రకటించింది.

20ఏళ్లుగా డీఎంకే అభ్యర్థిగా ఉన్న ఆమె.. తన కమ్యూనిటీకి అందిస్తున్న సేవలు మరింత విస్తరిస్తానని చెబుతుంది. కాగా, 15ఓట్ల వ్యత్యాసంతోనే ఆమె గెలుపొందడం విశేషం.

ప్రస్తుతం గంగా నాయక్ దక్షిణ ఇండియా ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ కు సెక్రటరీగా సేవలు అందిస్తున్నారు.

Read Also : ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు పోలీస్ ఉద్యోగాలు..నోటిఫికేష‌న్ జారీ చేసిన ప్రభుత్వం

దినసరి కూలీ కుటుంబానికి చెందిన గంగా.. సామాజిక కార్యకర్తగానే కాకుండా 50మందితో కలిసి థియేట్రికల్ ట్రూప్ ను నడిపిస్తున్నారు. అందులో 30 మంది ట్రాన్స్ జెండర్లే కావడం గమనార్హం.

12వేల 607పోస్టుల కోసం 57వేల 778 మంది అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపడ్డారు.

ఈ ఎన్నికల్లో మరో ప్రత్యేకత ఏంటంటే.. తల్లి, ఇద్దరు కొడుకుల్ని విజేతలుగా ప్రకటించగా భర్తా, భార్యలను కూడా విజేతలుగా ప్రకటించారు.

ఇదే ఎన్నికల్లో ఏఐఏడీఎంకేకు చెందిన అభ్యర్థితో పాటు మరో ఇద్దరికీ సున్నా ఓట్లు వచ్చాయి.

 

 

Read Also : ఎస్సై గా సెలక్ట్ అయిన ట్రాన్స్ జెండర్