Ghost Bike : వామ్మో.. దెయ్యం కానీ నడిపిందా? దానంతట అదే స్టార్ట్ అయ్యి కొంతదూరం వెళ్లిన బైక్, వీడియో వైరల్

రోడ్డు మీద పార్క్ చేసి ఉంచిన బైక్.. సడెన్ గా దానంతట అదే స్టార్ట్ అయ్యింది. కాస్త ముందుకు కదిలింది. ఆ తర్వాత అదంతట అదే పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Ghost Bike : వామ్మో.. దెయ్యం కానీ నడిపిందా? దానంతట అదే స్టార్ట్ అయ్యి కొంతదూరం వెళ్లిన బైక్, వీడియో వైరల్

Ghost Bike : అప్పుడప్పుడు కొన్ని చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అవసలు మన ఊహకు కూడా అందవు. ఆ ఘటనలు చూస్తే ఇది నిజమా? లేక మన భ్రమా? అనే సందేహం కలగకమానదు. అంత నివ్వెరపోయేలా ఉంటాయి కొన్ని ఘటనలు. తాజాగా.. మహారాష్ట్రలో జరిగిన ఓ ఇన్సిడెంట్ అందరినీ షాక్ కి గురి చేసింది. ఇది నిజమా? కాదా? అనే సందేహం కలిగించింది.

రోడ్డు మీద పార్క్ చేసి ఉంచిన బైక్.. సడెన్ గా దానంతట అదే స్టార్ట్ అయ్యింది. కాస్త ముందుకు కదిలింది. ఆ తర్వాత అదంతట అదే పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలో ఏ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందో తెలియదు కానీ, ఇప్పుడీ వీడియో మాత్రం వైరల్ అయ్యింది. ఓ ఇంటి ముందు రోడ్డు పైన బైక్ పార్క్ చేసి ఉంది. సడెన్ గా బైక్ స్టార్ట్ అయ్యి ముందుకు కదిలి పడిపోవడం వీడియోలో రికార్డ్ అయ్యింది.

ఆ బైక్ కి కీస్ లేవు. ఇంజిన్ కూడా ఆన్ లో లేదు. మరి, సడెన్ గా ఎలా స్టార్ట్ అయ్యింది. ముందుకు ఎలా కదిలింది? అనేది మిస్టరీగా మారింది. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఆ బైక్ ను దెయ్యం కానీ నడిపిందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు స్థానికులు. ఇది ఘోస్ట్ బైక్ అని అంటున్నారు.