నా కొడుకు వేలు ఇవ్వండి..అంత్యక్రియలు చేస్తాను..తండ్రి ఆవేదన

నా కొడుకు వేలు ఇవ్వండి..అంత్యక్రియలు చేస్తాను..తండ్రి ఆవేదన

Give me a finger of my son : ఉత్తరాఖండ్ ఛమోలీ జిల్లాలో ధౌలిగంగా నది ఎంతటి బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సమయం గడిచేకొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ప్రాణాలతో బయటపడతారా ? అని కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 180 మీటర్ల దూరంలో బాధితులున్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 36 మంది చనిపోగా..160 మందికిపైగా తప్పిపోయారు.

సొరంగంలో బురద, శిథిలాలను తొలగిస్తున్నారు. లోపలున్న వారికి ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేస్తున్నారు. తమవారిని చూసేందుకు అక్కడే కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కడసారి చూసేందుకు..అంత్యక్రియలు నిర్వహించేందుకైనా…భౌతికకాయాన్ని అయినా..అప్పగించాలని వేడుకుంటున్నారు. ఓ తండ్రి పడుతున్న బాధ వర్ణనాతీతంగా ఉంది. కనీసం నా కొడుకు వేలు అయినా..ఇవ్వండి..తమ ఊరికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తాము..అని ఆ తండ్రి అంటున్న మాటలు అందర్నీ కంటతడిపెట్టిస్తున్నాయి. విజయ్ సింగ్ వెల్డర్ గా పనిచేస్తుండగా..వరదలు రావడంతో..బ్యారేజీ కింద చిక్కుకపోయాడని తండ్రి ధమన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

2021, ఫిబ్రవరి 11వ తేదీ గురువారం నిన్న మధ్యాహ్నం ధౌలీగంగా ప్రవాహ మట్టం పెరగడంతో అక్కడ అలజడి రేగింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా సహాయ కార్యక్రమాలను నిలిపేశారు. దాదాపు గంట సేపటి తర్వాత రెస్క్యూ ఆపరేషన్ తిరిగి ప్రారంభమైంది. డ్రిల్లింగ్ యంత్రం మొరాయించిడంతో.. దాన్ని బయటకి తీసి, మరో యంత్రాన్ని తెప్పించారు. ఇండో-టిబెటన్‌ బోర్డర్ పోలీసు దళానికి చెందిన 450 మందితో పాటు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, సైనికులు మొత్తం 600కు పైగా జవాన్లు సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు. గల్లంతైన వారి జాడ గుర్తించేందుకు డ్రోన్‌ కెమెరాలు, రిమోట్‌ సెన్సింగ్‌ పరికరాలను ఉపయోగిస్తున్నారు.